Girija Devi Vardhanthi
శాస్త్రీయ సంగీతానికి ప్రాచుర్యం కల్పించిన గిరిజాదేవి
అక్టోబర్ 24న సంగీత విద్వాంసురాలు గిరిజా దేవి వర్ధంతి
గిరిజాదేవి సేనియా బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. ఆమె లలిత శాస్త్రీయ సంగీతంతో పాటుగా టుమ్రీలను గానం చేసింది. గిరిజాదేవి వారణాశిలో ఒక జమీందారీ కుటుంబంలో మే 8, 1929లో జన్మించింది. ఆమె తండ్రి రాందేవ్ రాయ్ హార్మోనియం వాయించేవాడు. తండ్రి ఆమెకు తొలి సంగీత గురువు. ఆమె తన ఐదవ యేట నుండి ప్రముఖ సారంగి విద్వాంసుడు సర్జు ప్రసాద్ మిశ్రా వద్ద ఖయాల్ , టప్పాలు పాడడం నేర్చుకుంది. తర్వాత శ్రీచంద్ మిశ్రా వద్ద వివిధ రీతుల సంగీతాన్ని అభ్యసించింది. తన తొమ్మిదవ యేట “యాద్ రహే” అనే సినిమాలో నటించింది. Girija Devi Vardhanthi
తల్లి, అమ్మమ్మలు తప్పు పట్టారు
గిరిజాదేవి తొలి సారి ఆకాశవాణి అలహాబాద్ కేంద్రం ద్వారా 1949లో బహిరంగంగా పాడింది. కానీ ఉన్నత తరగతి కుటుంబీకులు బహిరంగంగా ప్రదర్శనలు ఇవ్వడం సంప్రదాయం కాదని తన తల్లి, అమ్మమ్మలు వ్యతిరేకించారు. ఆ తరువాత 1951లో బీహార్‌లో దేవి తొలి సంగీత ప్రదర్శన చేసింది. ఆమె శ్రీచంద్ మిశ్రా వద్ద 1960లలో ఆయన మరణించే వరకు శిష్యరికం చేసింది. 1980లలో కలకత్తాలోని ఐ.టి.సి. సంగీత్ రీసర్చ్ అకాడమీ ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది. 1990 తొలి నాళ్లలో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో సంగీత శాఖలో పని చేసి పలువురికి సంగీత పాఠాలు నేర్పి తన సంగీత వారసత్వాన్ని నిలుపు కుంది. ఆమె తరచూ పలుచోట్ల పర్యటిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చింది. Girija Devi Vardhanthi
ప్రతిభకు అవార్డులు
గిరిజాదేవి పద్మశ్రీ పురస్కారం (1972), పద్మ భూషణ్ (1989), పద్మ విభూషణ్ (2016), సంగీత నాటక అకాడమీ అవార్డు (1977), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2010), మహా సంగీత్ సమ్మాన్ అవార్డు (2012), సంగీత్ సమ్మాన్ అవార్డు, గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డ్ 2012 (జీవన సాఫల్య పురస్కారం), తనరిరి పురస్కార్ సొంతం చేసుకుంది. ఆమె తన 88వ యేట అక్టోబర్ 24, 2017 న కోల్‌కతాలో గుండెపోటుతో మరణించింది.
9440595494