గాంధీజీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యమే’ మన వాలంటీర్ల వ్యవస్థ – సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి

AP 39TV 18 ఏప్రిల్ 2021:

బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఘనంగా వాలంటీర్ల సేవలకు సత్కారం.వాలంటీర్ అంటే ఉద్యోగం కాదు, వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా చేసే సేవ అనే భావనతోనే ఉద్యోగం చేయాలి.అలా ఒకొక్కరు ఆ విధిని ఎంతో బాధ్యతగా చేసిన వారున్నారు.వారికి ఈ రోజున సత్కారాలు అందుతున్నాయని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఘనంగా వాలంటీర్ల సేవలకు జరిగిన సత్కార సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకరోజు ఒక వృద్ధురాలు ఇంటి దగ్గర కాకుండా జ్వరంతో ఆసుపత్రిలో బాధపడుతూ ఉంది.ఒక వాలంటీర్ ఆమె ఎక్కడ ఉందో వెళ్లి, వెతికి ఆసుపత్రిలో ఉంటే ఒకవైపు కరోనా భయం ఉన్నా  ఆమెకు ఆ పెన్షన్ అందించి వచ్చాడు.అదీ సేవ అంటే.అదీ వాలంటీర్ అంటే అని ఒక ఉదాహరణతో సభికుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఇదేనని పేర్కొన్నారు. గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ఈ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ. కొత్త నాయకత్వం రావాలి.యువకులు ఉన్నత పదవులు అధిరోహించినప్పుడే సామాజిక చైతన్యం, ప్రజా సేవకు ఒక కొత్త నిర్వచనం వినిపిస్తుందని కొనియాడారు. ఇప్పుడు అవార్డులు వచ్చిన వారు గొప్పవారు కాదు. రాని వారు తక్కువా కాదు అని పేర్కొన్నారు. రాబోవు రోజులు వాలంటీర్లు మరింత స్ఫూర్తిమంతంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ తలారి రంగయ్య , జిల్లా కలెక్టరు శ్రీ గంధం చంద్రుడు , అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ,  జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు,వాలంటీర్లు మరియు నాయకులు పాల్గొన్నారు.

 

 

Comments (0)
Add Comment