Former minister kidnapped మాజీ మంత్రి కిడ్నాప్

Former minister kidnapped

మాజీ మంత్రి కిడ్నాప్

డిమాండ్ వింటే ఔరా అనాల్సిందే..

అగో ఈ పోటో ఎవరిదో గుర్తు పట్టారా..? తెల్లని గడ్డం, మీసాలు, వెంట్రుకలతో కనిపిస్తున్న ఈయన పేరు రఘవీరారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఈయన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ఇంట్లో తాడుతో కట్టేసిన రఘవీరారెడ్డి ఫోటోను చూస్తే ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి బంధించినట్లు ఉంది కదూ.. నిజమే.. తాళ్లతో కట్టేశారు.

వార్తల్లో రఘువీరారెడ్డి..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సఫరేట్ అయిన తరువాత పిసిసి అధ్యక్షుడిగా పని చేసిన రఘవీరారెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎందుకో ఏమో ఈ మధ్య పొలిటికల్ జోలికి పోకుండా పుట్టిన ఊరు అనంతపురం జిల్లా మడకశిర మండలంలో తన సొంతూరైన నీలకంఠాపురంలో దేవాలయం పనులు చూస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. కామన్ మెన్ లా బైక్ మీద తిరుగడం.. టెంపుల్ పనులు చూడటం.. ఇగో లోకల్ గా జరిగే ప్రోగ్రాంలలో తిరుగుతూ తరచు వార్తల్లోకి ఎక్కుతుండు.  

సోషల్ మీడియాలో వైరల్..

రఘవీరారెడ్డి Former minister kidnapped బందించినట్లు కనిపించే ఈ ఫోటో బిజీ అని చెప్పే పెద్దలకు హీతబోధనే. ప్రతి రోజు తనతో ఆడుకోకుండా బిజీగా ఉంటున్నారనే కారణంతో మనమరాలు సమైరా తాత రఘవీరారెడ్డిని సన్నని తాడుతో ఇంట్లోనే స్తంభానికి కట్టేసింది. ‘‘నాతో ఆడుకుంటావా తాతయ్య’’ అంటూ బుంగ మూతి పెట్టి అడిగింది మనుమరాలు. రఘవీరారెడ్డిని బంధించిన ఫోటోలను ఆయనే స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

పిల్లలకు టైమ్ ఇవ్వాలి.. పిల్లలకు కావాల్సింది ఆడుకోవడమే.. ఖరీదైన వస్తువుల కంటే పేరేంట్స్ తమతో గడువడమే ముఖ్యమనుకుంటారు. ఉరుకుల పరుగుల జీవితాలతో పిల్లలకు గంట టైమ్ ఇవ్వని ఈ రోజులలో రఘవీరారెడ్డి-సమైరా తాత మనుమరాలు Former minister kidnapped కథ చదివి పేరేంట్స్ ఆలోచించాల్సిందే. పిల్లల ఆలోచనలకు అనుకులంగా వ్యవహరించి వారికి అనువైన వాతారవరణం కల్పించాలని కోరుతున్నారు సోషల్ వర్కర్ కాసాల జైపాల్ రెడ్డి.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Former minister kidnapped /zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment