ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొనిరావాలి- ఏఐఎస్ఎఫ్

AP 39TV 19ఫిబ్రవరి 2021:

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని శుక్రవారం నాడు అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య కి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కృషి చేయాలని ఎంపీ ని కోరినట్లు తెలిపారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ ఆధీనంలో నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా చట్ట సభల్లోనూ తమ వాణి వినిపించి, ప్రజాక్షేత్రంలోనూ పరిశ్రమ పరిరక్షణకై ప్రత్యక్షంగ ప్రజా ప్రతినిధులు ముందుండాలని తెలిపారు. బిజెపి, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన కుట్రపూరితంగ, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రంలోని విద్యార్థులు, యువకులు, ప్రజలు గమనించి ఆ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని సాకులు చెప్పి ప్రైవేట్ పరం చేయడం సరికాదని, దానికి కావాల్సిన సొంత గనులు కేటాయించి ప్లాంట్ ను లాభాల బాటలో నడపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కొరకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వీరు యాదవ్, నగర నాయకులు హరి, రజినీకాంత్, విజయ్, సాయి వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment