ఆపదలో ఉన్న బాలుడి ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం చేసిన – SI ఆంజనేయులు

AP 39TV 04మే 2021:

గుడిబండ మండల పరిధిలోని గౌడనుకుంట గ్రామానికి చెందిన దళిత హనుమంతరాయప్ప కుమారుడు మూడుసంవత్సరాల బాలుడు గత మూడు రోజుల క్రితం రూ 5 కాయిన్ ను నోటిలో పెట్టుకుని అకస్మాత్ గా జారి నోట్లోనుంచి పేగులో చేరడంతో తల్లి, తండ్రులు కర్ణాటకలోని పావగడ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యుడికి చూపించగా స్కానింగ్ చేసి చూడగా 5 రూపాయల కాయిన్ కడుపులో నిలిచి పోయిందని దాన్ని ఆపరేషన్ ద్వారా తీయుటకు రూ 25 వేలు ఖర్చుఅవుతుందని తెలిపారన్నారు.కరోనా కట్టడికి లాక్ డౌన్ నేపథ్యంలో ఆ బాలుడి తల్లి తండ్రులు దీర్ఘాలోచనలో పడిపోయారు ఆపదలో ఉన్న ఆ బాలుడిని కాపాడేందుకు పలువురు గ్రామస్తులు ముందుకువచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.దింతో స్పందించిన పోలీస్ కానిస్టేబల్ రమేష్ఆచారి తనతోటి కానిస్టేబళ్లకు సమాచారం ఇవ్వగా 2011 వ బ్యాచ్ కు చెందిన అనంతపురము జిల్లాలోని పోలీస్ కానిస్టేబళ్లు స్పందిస్తూ గ్రామస్తులతో పాటు పోలీసులు విరాళంగా ఇచ్చిన రూ 30 వేలు నగదును అమరాపురం ఎస్ఐ ఆంజనేయులు చేతులమీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబల్ రవి,కానిస్టేబళ్ళు మంజునాథ్,అన్వేష్, పాతన్న, కుసుమలత, హోం గార్డ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.

Comments (0)
Add Comment