దొంగల ముఠా పెట్టే తప్పుడు కేసులు మమ్మల్ని భయపెట్టలేవు

రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో కొంతమంది దోపిడీ దారులు ముఠా గా ఏర్పడి యథేచ్ఛగా వనరులను కొల్లగొడుతున్నారని మాజీమంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వారి దుర్మార్గాలను ప్రశ్నిస్తే, దాడులు చేయడం, అక్రమంగా కేసుల్లో ఇరికించడం పరిపాటిగా మారిందన్నారు. కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇటీవల టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి మారుతిపై దాడి జరిగిందని తాము బలంగా నమ్ముతున్నామన్నారు. దానిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తే ఆయనపై అక్రమ కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అధికార మదంతో వైసీపీ నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. డీ హిరేహాల్ మండలంలో వైసీపీ నాయకుల దోపిడిపై త్వరలోనే ప్రజలముందు వివరాలు బహిర్గతం చేస్తామన్నారు. తప్పుడు కేసులను తిప్పికొడుతూనే ‘కాపు’ దొంగల ముఠా అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడతామని కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు

Comments (0)
Add Comment