Except for the Cinemas Act థియేటర్ దోపీడిల నివారణకే గదా

Except for the Cinemas Amindment Act ..?

సినిమాస్ అమైండ్మెంట్ యాక్ట్ తప్పెంటి..?
థియేటర్ దోపీడిల నివారణకే గదా..?

ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమైండ్మెంట్ యాక్ట్ గురించి అప్పుడే కొందరు తీవ్రమైన నష్టం జరిగిపోతుందన్నట్టు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏముందా చట్టంలో? టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు అంది. అలాగే ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అంది. అంతే కదా..

ప్రజలకు జరిగ నష్టమేంటి?

దీని వల్ల ప్రజలకు జరిగ నష్టమేంటి? అభిమానులకు జరిగే నష్టం ఏమిటి? తమ అభిమాన హీరో సినిమా మార్నింగ్ షో చూడాలనుకునే అభిమానులను టిక్కెట్టు రేటు వెయ్యి రూపాయలు పెట్టి దోచుకోవడం సరికాదు అంది ప్రభుత్వం అందులో తప్పేంటి? అలాగే పగలూ రాత్రీ వరసగా షోస్ వేయడం తప్పు ఓ పద్దతిలో వేయండి అన్నది. అందులోనూ తప్పేం లేదు. పాప్ కారన్ పేరుతో మల్టీప్లెక్సులు బెన్ఫిట్ షోస్ పేరుతో పెద్ద హీరోలూ ప్రజలను థియేటర్లకు దూరం చేస్తే వాటి మీద ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? థియేటర్లు మూత పడే పరిస్థితికి తీసుకొస్తున్న ఈ విపరీత దోరణులను అడ్డుకోవడం తప్పా? అసలు బెనిఫిట్ షోస్ ఎందుకు వేస్తారు?

హీరోల రెమ్యూనరేషన్లు చెల్లించడానికి

హీరోల రెమ్యూనరేషన్లు చెల్లించడానికి నిర్మాతలకు ఉన్న ఏకైక అవకాశం బెనిఫిట్ షోస్. అంటే వారి అభిమానులను దోచి వారికి పెట్టడం తప్ప ఇందులో థియేటర్ల వారికి ఒనగూడేది ఏమీ ఉండదు. నేరుగా నిర్మాతే బ్లాక్ అమ్మి హీరోల జేబులు నింపడానికే బెనిఫిట్ షోస్ వేస్తారు. సినిమా బడ్జెట్ లో సగం పైగా తమ రెమ్యూనరేషన్ అడుగుతున్నారు హీరోలు. డిమాండ్ అండ్ సప్లై ప్రకారం తమను చూడాలనుకునే జనాన్ని దోచుకునే స్వేచ్చ మాకే ఉండాలని ఈ మధ్య రిపబ్లిక్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడడం మనకు తెల్సు. నా సినిమా అంటే పిచ్చ ఉంది కనుక ఆ పిచ్చను నేను సొమ్ము చేసుకుంటాను అన్జెప్పడం అంటే ప్రేక్షకుల మీద గౌరవం లేకపోవడమే అనే విషయం ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.

కొత్త చట్టంతో నష్టం లేదు

ఇలా పెద్ద హీరోల దోపిడీని అడ్డుకోడానికి ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకువచ్చిన కొత్త చట్టం ఖచ్చితంగా సినిమాను ప్రేక్షకులకు దగ్గరచేస్తుందని మదీయ దిక్కుమాలిన అభిప్రాయం. థియేటర్లను బతికిస్తుంది అని కూడా నా అభిప్రాయం. కొత్త చట్టం వల్ల మాకు జరిగే నష్టం ఏమీ లేదని ఇప్పటికే థియేటర్ల యజమానులు చెప్తున్నారు. ప్రజల్లో సినిమా పట్ల ఉన్న ఇంట్రస్టును ఎక్స్ ప్లాయిడ్ చేస్తాం రెండు రోజుల్లో దోచుకుంటాం అంటే ప్రబుత్వాలు ఎందుకు అంగీకరించాలి? ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితం గా ప్రభుత్వాలదే. కనుక టిక్కెట్ల అమ్మకాల విషయంలోనూ బెన్ఫిట్ షోస్ విషయంలోనూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లో ఎంత మాత్రమూ తప్పులేదు. కేవలం జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకునే హీరోలకు మాత్రమే ఇది తప్పుగా కనిపిస్తుంది. Except for the Cinemas Amindment Act ..?

సినీహీరో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ టిక్కెట్ల రేట్లు పెంచుకుంటే మాకేంటి తగ్గించుకుంటే మాకేంటి?
అదంతా థియేటర్ వాళ్లకు వచ్చే లాభాలు అన్నారు. థియేటర్ వాళ్లకు వచ్చే లాభాలు కాదు కనుకే ఆయన ఈ అంశాన్ని అంత రచ్చచేశాడు. ఈ అధిక రేట్ల వల్ల మాకేం ప్రయోజనం ఉండదు అని నేరుగా థియేటర్ల యాజమాన్యాలూ చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. జనం నుంచీ దోచుకున్న ఆ సొమ్మును నేరుగా హీరోల జేబుల్లోకే చేరుస్తారు నిర్మాతలు. ఈ విషయం అందరకి తెల్సినదే. బెన్ఫిట్ షోసూ వెయ్యిరూపాయల వరకూ టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశాలూ లేకపోతే పెద్ద హీరోలకు కోట్లకు కోట్లు పారితోషికాలు ఇవ్వడం కుదరదుగాక కుదరదు.

సినీహీరోల భయం

అదే పవన్ కళ్యాణ్ భయం. చిరంజీవి భయం. మెగా కాంపౌండ్ హీరోల సినిమాలు వరసగా మూడు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. చిరంజీవి ఆచార్య, పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాలు విడుదలకు రడీ అవుతున్నాయి. ఈ మూడు సినిమాల మీదా భారీ అంచనాలున్నాయి. వాటిని సొమ్ము చేసుకోడానికి ప్రభుత్వం అడ్డుపడుతోందనేది మెగాహీరోల ఆవేదన. అభిమానుల్ని దోచుకోవడమే వారి లక్ష్యం. కనుక అభిమానులూ ఒక్కసారి కొత్త సినిమా చట్టం ఏం చెప్పిందీ నష్పోయేది ఎవరూ అనేది ఒక్కసారి చూసుకుని అప్పుడు నేరుగా మీరే ప్రభుత్వ చర్య మీద మీ నిరసన తెలియచేయండి అంతే తప్ప హీరోలు గుండెలు బాదుకుంటే మీరు చలించిపోకండి. మీ పీకలు కోసుకు తినడానికి ఎంత మాత్రం వెనుకాడని హీరోలున్నారిక్కడ. Except for the Cinemas Amindment Act ..?

అభిమానులూ జాగ్రత్త

ఇంతగా జగన్ ప్రభుత్వాన్ని వెనకేసుకురాడానికి కారణం ఏటంటే..? ఇదే ఊపులో కూసింత ఆ దిక్కుమాలిన మందు నుంచీ మాయదారి ధరల నుంచీ జనాన్ని కాపాడతాడని హోపు. ఆ ఈ చట్టం కూడా రెండు నెలలలో రద్దు చేయకపోతే నా పేరు తిరగతిప్పి పెట్టుకో అన్నాడు ఇందాక మా ఎమ్ సత్యప్రకాష్. సూద్దారీ ఏటి జరుగుతాదో..

Bharadwaja Rangavajhala

Except for the Cinemas Amindment Act/ cinema ap / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment