Everyone’s view Naxalite word అందరి నోట నక్సలైట్ మాట

అందరి నోట నక్సలైట్ మాట
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు

పొలిటికల్ లీడరులు కూడా నక్సలైట్ మాట

నక్సలైట్ అగ్ర నేత రామక్రిష్ణ ఆనారోగ్యంతో మృతి  కథలు కథలుగా సోషల్ మీడియాలో వైరల్. అనుకులంగానో.. వ్యతిరేకంగానో ఎక్కువ మంది నక్సలైట్ ఉద్యమం గురించి పోస్ట్ లు పెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏ కాలానికి ఆ గొడుగు పట్టుకునే వారి నోటి నుంచి కూడా నక్సలైట్ మాట వినాల్సి వస్తోంది. శతృవు కావచ్చు.. మితృడు కావచ్చు. అందరూ నక్సలైట్ మాటనే మాట్లాడుతున్నారు.

నక్సలైట్లు మళ్లీ రావాలి : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశాడు. సమస్య ప్రధాన్యతను గుర్తు చేయడానికి నక్సలైట్ ల గురించి మాట్లాడారు. ‘‘ఎందుకురా నక్సల్స్ లేకుండా చేశావ్.. దేవుడా వాళ్లు ఉంటే అయినా భయపడే వాళ్లని అనిపిస్తోంది. నక్సలైట్లు మళ్లీ రావాలి.దొరల గడిలు ద్వంసం చేయాలి.’’ అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యం ముసుగులో కొనసాగుతున్న పొలిటికల్ స్వామ్యంను చూసి అతను అలా మాట్లాడడెమో. నక్సలైట్లు ఉంటే అన్యాయం జరుగదని అతని ఉద్దేశ్యం కావచ్చు. తప్పులు చేయాలంటే భయం ఉంటుందని భావన కావచ్చు. ఈ రేవంత్ రెడ్డి గతంలో కూడా చాలా సార్లు నక్సలైట్ల ప్రస్థావన తెచ్చాడు. గడిల పాలన పోవాలంటే నక్సలైట్లు మళ్లీ రావాలని కోరారు. Everyone’s view Naxalite word

నక్సలైట్ల ఎజెండా మాదే : కేసీఆర్

కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి హోదాలో నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో  నక్సలైట్ల ఎజెండాతో ముందుకు వెళుతామని కేసీఆర్ కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు అన్న మాటలు. గతంలో తెలుగు దేశం అధినేత ఎన్టీ రామారావు ఎన్నికల  ప్రచారంలో ‘నక్సలైట్లే దేశ భక్తులు’ అన్నారు. బూటకపు ఎన్ కౌంటర్ లు ఉండవన్నారు. అధికారంలోకి రాగానే సేమ్ టు సేమ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా నక్సలైట్లకు అనుకులంగా మాట్లాడారు. నక్సలైట్ల ఉద్యమం శాంతి భద్రతల సమస్య కాదని చర్చలకు ఆహ్వనించారు ఆయన. చంద్రబాబు నాయుడు నక్సలైట్ల పట్ల కఠినంగా వ్యవహరించారు.  ఇగో ఈ నక్సలైట్ల ప్రస్థావన అగ్రనేత రామక్రిష్ణ మరణంతో మళ్లీ తెరపైకి వచ్చింది.

ఒకప్పుడు నక్సలైట్ పదమంటెనే భయం..

నిజానికి ఒకప్పుడు నక్సలైట్ పదం వినాలన్న మాట్లాడలన్న గుండెల్లో దడ. గడ్డం పెంచుకున్న యువకులు కనిపిస్తే నక్సలైట్ ముద్ర. రెడ్ షెర్టు వేసుకుంటే పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి లాఠీలతో చితుక బాధిన ఘటనలు. పట్ట పగలు ప్రజలంతా చూస్తుండగానే యువకులను మాయం చేసిన ప్రశ్నించినోళ్లు లేరు. నక్సలైట్-పోలీసుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే నాటి పరిస్థితులు. నక్సలైట్లు కూడా అంతే. తప్పు చేసినోళ్లను దేహశుద్ది చేశారు. దున్నేవానిదే భూమి అంటూ భూస్వాములకు మరణశిక్ష విధించారు. Everyone’s view Naxalite word

అర్బన్ నక్సలైట్లుగా

ఒకప్పుడు వామ పక్షలు, అభ్యుదయ వాదులు, పౌర హక్కుల కార్యకర్తలు నక్సలైట్ ఉద్యమానికి అనుకులంగా మాట్లాడేవారు. ప్రభుత్వం వారిని అర్బన్ నక్సలైట్లు అంటూ ముద్ర వేసింది. విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు దేశ ప్రధాని నరేంద్ర మోడిని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హంతం చేసినట్లు వ్యూహం పన్నాడని మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి ఏళ్లు గడుస్తోంది. ఇంకా జైల్ లోనే ఉన్నాడు. మావోయిస్టు నక్సలైట్లపై ప్రభుత్వం నిషేదం విధించింది. అయినా నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడే వారంతా సానుభూతి పరులు కారు.

కనుమరుగైన నక్సలైట్లు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల కార్యకలపాలు కనుమరుగయ్యాయి. 1990 దశకంలో నక్సలైట్లు రాష్ట్రంలో పోటీ ప్రభుత్వం నడిపారు. తప్పు చేసినోడు ఎవడైనా వాణ్ణి ప్రజాకోర్టులో శిక్షించారు. ఆ నక్సలైట్ ల శిక్షలకు తప్పు చేయాలంటే భయంతో వణికే వారు. రెండు దశాబ్దాల పాటు నక్సల్స్ దే పైచెయి.  ప్రభుత్వం నక్సలైట్ల కార్యకలపాలపై ఉక్కుపాదం మోపింది. నక్సలైట్ల కార్యకలపాలు కనుమరుగయ్యాయి. అప్పుడప్పుడు రాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న కాల్పులలో నక్సలైట్లు మరణిస్తూనే ఉన్నారు. నక్సలైట్ల ఎజెండానే మాది అని చెప్పిన టీఆర్ ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్ కౌంటర్ లు ఆగడం లేదు. Everyone’s view Naxalite word

నక్సల్భరీ ఉద్యమ ప్రస్థానం

నక్సల్బరీ ఉద్యమానికి ఐదు దశాబ్దాలు దాటింది. 1967లో చారు మజుందర్ నాయకత్వంతో భూమి కోసం గిరిజనులు ఉద్యమించారు. చారిత్రాకమైన ఆ ఉద్యమం హింసత్మకంగా మారింది. భారత దేశం ఒక్కసారి ఉలిక్కి పడ్డది.  తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని ప్రకటించారు చారు మజుందర్. 1975లో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధ్యమని పేర్కొన్నారు. మజుందర్ మాటలు ఆచరణలో సాధ్యం కాలేదు. కాలక్రమేణ ఆ నక్సలైట్ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఎన్నో రూపాలలో విస్తరించింది. ఇంకా విస్తరిస్తోంది. ప్రభుత్వం-నక్సలైట్ ల మధ్య యుద్దం జరుగుతునే ఉంది. నక్సల్బరీలో చారు మజుందర్ ప్రారంభించిన ఉద్యమం శ్రీకాకుళం అడవులను అంటుకుంది. 1970 దశకంలో కొండపల్లి సీతారామయ్య తెలంగాణలోని వరంగల్ లో నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎత్తుగడలు.. గెరిల్లా పోరాట వ్యూహంతో ప్రారంభించిన ఆ నక్సలైట్ ఉద్యమానికి యాభై నాలుగు ఏళ్లు గడిచిన వారు కోరుకునే విప్లవం సాధ్యం కాలేదు. అయినా.. తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని ఇంకా పోరాటం చేస్తునే ఉన్నారు నక్సలైట్లు.

నక్సల్స్ హింస మార్గం వద్దు

విశాలమైన భారత దేశంలో నక్సలైట్లు కోరుకునే విప్లవం ఆచరణలో సాధ్యం కాదనే మాట తెరపైకి వస్తోంది. ఒకప్పుడు నక్సలైట్ల పంథాను సమర్థించిన వారు సైతం తుపాకి వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరే వారి సంఖ్య పెరుగుతుంది. సోషల్  మీడియాకు బానిసైన యువత తుపాకులు పట్టుకుని విప్లవం కోసం పోరాటం చేయాలనే ఆలోచన వారికి లేదని చెబుతున్నారు. ప్రజా ఉద్యమాలతో దోపీడి లేని నూతన వ్యవస్థ ఏర్పాటు చేయచ్చానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విద్యావంతులు.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

సెల్ : 949 222 5111

 

Everyone's view Naxalite word /naxalights/ maoist laxalights/ zindhagi.com/ yatakarla mallesh/ cpi ml maoist group
Comments (0)
Add Comment