Employment with Variety idea
వెరైటీ ఆలోచనతో ఉపాధి
బతుకు తెరువు లేదనేటోళ్లకు గీ వెంకటేశం ఆధర్శం. సర్కార్ కొలువు వత్తలేదని ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచన చేసే వారికి ఇతను స్పూర్తి. అంగ వైకల్యం ఉన్నప్పటికీ బిఇడి చదివాడు. సర్కార్ కొలువు కోసం బాగానే ప్రిపేర్ అయ్యాడు. అయినా.. ప్రభుత్వం నొటిఫికేషన్ లు ప్రకటిస్తాలేదని ఆలోచన చేశాడు అతను. అంతే.. నడువలేని తనకు తోడుగు ఉన్నస్కూటిపై పాన్ డబ్బా పెట్టుకుని ఉపాధి పొందుతున్నాడు గీ వెంకటేశం. పాన్ కావాలని ఫోన్ చేస్తే కూడా క్షణాలలో వెళ్లి పాన్ ఇస్తుంటాడు అతను.
ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తోంది. ఇది ఓ సెల్ ఫోన్ వారి నినాదం. కానీ ఓ ఆలోచన మాత్రం వెంకటేశంకు ఉపాధిని కల్పిస్తోంది. శరీరంలో అంగ వైకల్యం ఉందని బాధ పడకుండా చిన్నపాటి వ్యాపారం చేస్తున్న వెంకటేశం నేటి యువతకు ఆధర్శం అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు సోషల్ వర్కర్ కాసాల జైపాల్ రెడ్డి. ఇంతకు ఈ వెంకటేశం ఊరు చెప్పలేదు కదా.. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం జనగాం గ్రామం.