విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత-ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

AP 39TV 08మార్చ్ 2021:

తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలని ఉంటుందని, కానీ ఆర్థిక స్థోమత లేక అలాగే ఉండిపోయేవారన్నారు. తన పాదయాత్రలో ఈ విషయాన్ని గ్రహించిన సీఎం జగన్‌.. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందిస్తున్నారని అన్నారు. ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామన్నారు.

రూ.65 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌

నగరంలోని 50వ డివిజన్‌లో రూ.65 కోట్లతో హెచ్‌ఎల్‌సీ కాలువకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మించనున్నట్లు అనంత తెలిపారు. డివిజన్‌ పరిధిలో రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు. బళ్లారి బైపాస్‌ నుంచి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, సూర్యనగర్, కలెక్టరేట్‌ మీదుగా పంగల్‌ రోడ్డు వరకు రూ.310 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తామని తెలిపారు. రానున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ తీసుకొస్తామన్నారు. అనంతపురం నగరంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలను సైతం అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగరంలోని 50 డివిజన్లలోనూ వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 

Comments (0)
Add Comment