* Dussehra means … ‘fun’ festival !!*దసరా అంటేనే…’సరదా’ పండగ !!

 * Dussehra means … ‘fun’ festival !!

*దసరా అంటేనే…’సరదా’ పండగ !!

“అయ్యవార్లకు చాలు రెండు రూపాయలు…
పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు”.!!

మా చిన్న తనంలో దసరా పండగొచ్చిందంటే బడి పంతుళ్ళకి మహా ఆనందం.పండగ ఇంకా పది రోజులుందనగానే … పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇళ్ళకు బయలుదేరతారు. జయీభవ విజయీ భవ.అయ్యవార్లకు చాలు అయిదువరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలంటూ పద్యాలు పాడించి గురుదక్షిణ కింద రూపాయో,రెండు రూపాయలో తీసుకునే వారు.ఇది మన తెలుగు సంప్రదాయం.

పిల్లలు కూడా పాఠశాలలో నుంచి బయట పడి ఇల్లిల్లు తిరగటం సరదాగా భావించేవారు. ఒక్కోరోజు ఎవరెవరి ఇళ్ళకు వెళ్ళబోతున్నామో ముందుగానేకబురు పంపే వారు. కొందరు పిల్లలకోసం మరమరాలు,పుట్నాలు,బెల్లం కలిపిసిధ్ధంగా వుండేవారు.మరికొందరైతే రేపు రండి,అంటూదాటేసేవారు. అలాంటి వారి ఇంటివద్ద “రేపురా! మాపురా మళ్ళిరమ్మనక ” అంటూ ….పద్యాన్ని పాడించేవారు.విసుగు పుట్టి పప్పు
బెల్లాలు లేకుండగానే అయ్యవారికి రూపాయో, రెండు…. మూడురూపాయలో దక్షిణగా సమ ర్పించి చేతులు దులుపుకునే వారు.ఇలాంటి వారిని పిల్లలు తిడుతూ… శాపనార్థాలు పెట్టేవారు (ఎవరికీ వినబడకుండా )ఆరోజుల్లో రూపాయంటే ఓ బియ్యం బస్తా వచ్చేది. ఇలా పిల్లల్ని దసరా పేరీట ఇల్లిల్లుతిప్పడం బడి పంతుళ్ళ ఆనవాయితీ.దీన్ని ఎవరూ తప్పు పట్టే వారు కూడా .ప్రయివేటు ,ప్రభుత్వ పాఠశాలలన్న భేదం లేకుండా పంతుళ్ళందరూ దసరా మామూళ్ళకోసం పిల్లల్ని తీసుకొని ఇల్లిల్లూ తిరిగే వారు.ఉన్న వాళ్ళు వాళ్ళ తాహతు మేరకు తృణమో పణమో ఇచ్చేవారు. లేనివాళ్ళు చేతులు జోడించి నమస్కారం పెట్టే వారు. * Dussehra means … ‘fun’ festival !!

ఈ దసరా పరేడ్ లో కొందరు పిల్లలు రంగు రంగులవిల్లంబులు కూడా పట్టుకొనేవారు.దసరా పండగ సమయంలో ఈ విల్లంబుల్ని ప్రత్యేకంగా తయారు చేసి అమ్మేవారు.ఇల్లిల్లూ తిరిగే సమయంలో పిల్లలందరూ క్యూ కట్టేవారు.పండగ నినాదాలు, దసరాపద్యాలు పాడుకుంటూ వెళ్తుంటే చూడ్డానికి ముచ్చటగా వుండేది.ఆ సమయంలో పంతుళ్ళచేతిలో బెత్తం మాత్రం కంపల్సరీ గా వుండేది.ఎవరైనా క్యూ నుంచి బయటకు వస్తే మాత్రం వాడి అరచేతిలో బెత్తం దెబ్బపడేది. అందువల్ల పిల్లలు కూడా చాలా క్రమ శిక్షణతోవుండేవాళ్ళు.ఈ దసరా మామూళ్ళలో మరో విశేషముంది.దసరా పండగ హిందువులది కాబట్టి కేవలంహిందూ పిల్లల ఇళ్ళకే వెళ్ళడం కాకుండా,ముస్లిం,క్రిస్టియన్ తదితర పిల్లల ఇళ్ళకు కూడావెళ్ళడం జరిగేది.ఇప్పుడైతే కుల, మతాల కాష్టం కాలుతోంది గానీ ఆరోజుల్లో ఇటువంటి ఆలోచనే వచ్చేది కాదు.ముఖ్యంగా పిల్లలకు ఈ కులమతాల రొష్టు గురించి తెలిసేది కాదు.అలాగే బడి పంతుళ్ళు కూడాను.మా పంచాయితీ బోర్డు పాఠశాలలో అయితే వున్న ఇద్దరుపంతుళ్ళూ ప్రకాశరావు,జార్జి గారు పక్కా క్రిస్టియన్లు.రోజులు మారి పోయాయి.కాలం ముఖానిక ముసుగేసు కోవడం మొదలెట్టింది.క్రమంగాదసరా మామూళ్ళు,పిల్లల పరేడు లాంటి సాంప్రదాయిక సరదాలు కనుమరుగయ్యాయి.అయ్యవార్లకు,పిల్లలకు,పిల్లల తలిదండ్రులకు మధ్య వుండే ఆప్యాయతలు,ర్యాపోర్ట్ కనుమరుగైపోయింది. విద్య వ్యాపారం అయిన దగ్గరనుంచీ మన సంస్కృతి సాంప్రదాయాలకు చీడ పట్టింది.పిల్లల్లో సమష్టి భావన, కలగొలుపుతనం పూర్తిగా మాయమైంది.అయ్యవార్లకువిద్యార్థులకు మధ్య వుండే ఆప్యాయతలు,ప్రేమ తుడిచి పెట్టుకు పోయింది.ఇప్పుడంతా వ్యాపార చదువులు…. * Dussehra means … ‘fun’ festival !!

కృత్రిమ సంబంధాలు. అవకాశవాదం.’మేము’ అనే….
భావన పోయి ‘ నేను ‘అనే తత్వం ముదిరింది.ఫలితం
గా మన చదువుల్లో “మనం “ అనే పదం పూర్తిగా అదృశ్యమైంది.(చిత్రం..పి.వి.సాయిరామ్,కోవూరు)

*మిత్రులకు దసరా శుభాకాంక్షలు..!!

*ఎ.రజాహుస్సేన్.
హైదరాబాద్….?!

* Dussehra means ... 'fun' festival !!/zindhagi.com/dasara festival/ yatakarla mallesh/zindhagi
Comments (0)
Add Comment