– నెల పాటు అమెరికాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూర్
– జనవరి 4వరకు దరఖాస్తుల స్వీకరణ
– ఇప్పటికే శిక్షణ పూర్తయిన వారికి వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్ :: నిత్యం మార్పులకు లోనవుతున్న ఐటీ రంగంలో నూతన నైపుణ్యాలను నేర్చుకున్న వారికే అందులో మనుగడ, అవకాశాలు సొంతం అవుతాయన్నది తెలిసినప్పటికీ, వాటిని అందిపుచ్చుకునే వేదికలే తక్కువగా ఉంటాయి.
పరిమిత సంఖ్యలో ఉన్న వివిధ సంస్థల్లోనూ నిపుణుల కొరత, విశ్వసనీయత వంటి సవాళ్లు!. ఇలాంటి నేపథ్యంలో ఐటీ రంగంలో నూతన అవకాశాలకు వేదికగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ అవకాశం ఇటీవలే ఒకసారి కల్పించిన డిజిథాన్ సంస్థ మరోమారు ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ చాన్స్ అవకాశం కల్పిస్తోంది.
ఈ మేరకు జనవరి 4వరకు స్వీకరించనున్న దరఖాస్తుల ప్రక్రియ వివరాలు నేడు వెల్లడించింది. ఒక్కో బ్యాచ్‌కు కేవలం 25 మందికే అవకాశం కల్పించబడుతుంది. జనవరి 6 తేదీ నుంచి బ్యాచ్ ప్రారంభం కానుంది. 2నెలల శిక్షణ అనంతరం మార్చి 6వ తేదీన ఈ విద్యార్థులు అమెరికాకు ప్రయాణం అవుతారు.