తాత్కాలిక ఆసుపత్రికి వీల్ చైర్లు అందించిన సామాజిక కార్యకర్త దేవా నరేశ్
అనంతపురము, మే 28
శుక్రవారం ఉదయం సామాజిక కార్యకర్త దేవా నరేశ్ అనంత పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న తాత్కాలిక ఆసుపత్రికి 10 వీల్ చైర్లను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా కోవిడ్ విపత్కర సమయంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న దేవా ఫౌండేషన్ ట్రస్టు చైర్మన్ దేవా నరేశ్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. ముఖ్యంగా ప్రతి రోజూ వంద ఆక్సిజన్ సిలిండర్లను సొంత ఖర్చుతో అందించి కోవిడ్ పై పోరాటంలో అధికార యంత్రాంగానికి సహకరించడాన్ని కొనియాడారు.
ఆర్డీటీ అసుపత్రిలో ప్రతి రోజూ కోవిడ్ బాధితులకు ఒక్కొక్కరికి రెండు కోడి గుడ్లు అందిస్తూ ప్రజలకు నాణ్యమైన భోజనం అందించడంలో తోడ్పడుతున్నందుకు దేవా నరేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు.