Destination is her goal గమ్యమే ఆమె లక్ష్యం

Destination is her goal

గమ్యమే ఆమె లక్ష్యం

ఆమె నడక సారించకపోతే
బతుకు చాలించాల్సిందే
నిండు చూలాల భూమి
రాట్నంలా గిరి గిరా తిరగకపోతే
రాత్రిప-గలేది! పగలు- రాత్రేది!?

ఆమె పాదాలతో ప్రవహించకపోతే
నేలను పాదాలు తాకకపోతే
ఆమె ప్రపంచాన్ని ప్రసవించకపోతే
ఈ సృష్టి తెలవారేదెట్లా !?

ముందు వెనక చూడలేదు
దూరా భారం తలవలేదు
ముల్లె భుజానకెత్తుకుంది
నీళ్ళోసుకున్న నేలతల్లిలా
పాలు పోసుకున్న పంట కంకిలా
ఆమె గమ్యమే ఆమె లక్ష్యం!

కూర్చుంటే దారెట్టా సాగుద్ది
దినమెట్టా గడుసుద్ది
పిల్లముగ్గురు బతకు మెతుకు
గగనమే కదా?

కాయకష్టం చేసేటోడేననేగా
ఏడడుగులు వేసింది
ఇప్పుడు వాడికోసం కాకపోయిన
కడుపులో కదిలే బిడ్డను కనేది ఎట్లాని !?

ప్రపంచమె స్థంబించింది
పాడులోకం, ఇది ఆమెకు
కొత్తేముంది ,బతుకు బరువు
కంటే మోత బరువు లెక్కేమఎజ్రాశాస్త్రిిోసం ఇన్ని అవస్థలా !
మనుషులు లేనికాడనుంచి
మేఘమున్నకాడికి గంపెత్తుకొని
కాలం వెంబడి కాలు సాగించిన
రోజులు ఎన్ని లేవు ?

ఆమె అలసి ఆదమర్చి నిద్రపోతే
ఓ అంబులెన్సులా పరుగెడదాం
రండి ! అక్కున చేర్చుకుందాం !

అంతరిక్షంలో అడుగుపెట్టిన మహిళ కంటే
మహిలో బతుకు చేత బట్టి గతుకులరోడ్డులో
నడక సాగించి రేపటి భావి భారతాన్ని
ప్రసవించడానికే ఆమె నడుస్తుంది!!

– ఎజ్రాశాస్త్రి

(నిండు చూలాలైన వలస కూలితల్లి నడక చూసిన తర్వాత)

Destination is her goal / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment