Death of mother of Maoist leader మావోయిస్టు నేత మాతృ వియోగం!

Death of mother of top Maoist leader

మావోయిస్టు అగ్రనేత మాతృ వియోగం!

మావోయిస్టు అగ్రనేత స్వామి అలియాస్ లోకెటి చందర్ కు మాతృ వియోగం!

సాక్షి దిన పత్రికలో ఈరోజు ఆ వార్త చూడగానే హృదయంలో ఏదో బాధ.. ఆ మాతృమూర్తిని ఒకే సారి నేను కలిశాను. సరిగ్గా ఏడేండ్ల క్రితం (5.10.2015 నాడు) వీ6 న్యూస్ సీనియర్ రిపోర్టర్ గా మావోయిస్టు అగ్రనేత స్వామి అలియాస్ లోకెటి చందర్ పోరుబాట పట్టడంతో వృద్దాప్యంలో తల్లి పడుతున్న బాధలపై ప్రత్యేక కథనం ఇవ్వడానికి వెళ్లిన రోజు.. కానీ.. ఆ కథనం ప్రచురితం కాక పోవడానికి కారణం నాకు తెలియదు.

కానీ.. ఈ రోజు ‘‘మావోయిస్టు అగ్రనేత స్వామి అలియాస్ లోకెటి చందర్ కు మాతృ వియోగం!’’ అనే వార్త చదువగానే ఆనాటి జ్ఞాపకాలు కళ్ల ముందు తిరిగినవి.

‘‘పోరుబాట పట్టిన నీ కొడుకును ఏమి కోరుతున్నావమ్మ’’ నా ప్రశ్న..

‘‘చచ్చే లోపు ఒక్కసారైన నా కొడుకు స్వామిని చూడాలని ఉంది.’’  అంది ఆ మాతృమూర్తి కిష్టాబాయి.

ఆ తల్లి మరణ వార్తను మాత్రమే ఇప్పుడు మీకోసం.. పూర్తి వివరాలతో స్వామి కుటుంబం గురించి రాస్తాను. ఆ రోజు ఆ మాతృమూర్తి మాట్లాడిన మాటలు ఇప్పటికి నాకు గుర్తున్నాయి.

సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త..

 స్వామి తల్లి కిష్టాబాయి మృతి

సాక్షి, కామారెడ్డి: సీపీఐ మావోయిస్టు | అగ్రనేత స్వామి అలియాస్ లోకేటి చందర్ తల్లి కిష్టాబాయి(90) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. సొంత గ్రామమైన కామారెడ్డి మండలం ఇస్రోజి వాడి గ్రామంలో ఉంటున్న కిష్టాబాయి కొంత కాలంగా వృద్ధాప్యంతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా ఆమె అంత్యక్రియలు గ్రామంలో నిర్వహించారు. కిష్టాబాయికి ముగ్గురు కుమారులు. అందులో స్వామి అలియాస్ లోకేటి చందర్ చిన్నవాడు.

ముప్పయి ఏళ్ల క్రితం నక్సల్స్ బాట..

మూడు దశాబ్దాల క్రితం అప్ప టి పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. స్వామితో పాటు ఆయన భార్య సులోచన, కొడుకు రమేశ్, కూతురు లావణ్య కూడా స్వామి బాటలో నడిచారు. నాలుగేళ్ల క్రితం స్వామి భార్య సులోచన అనారోగ్యంతో దండకారణ్యంలో మృతిచెందగా విప్లవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా స్వామి మావోయి పార్టీ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ కిషాబాయి(ఫైల్) సభ్యుడిగా పనిచేస్తుండగా, ఆయన కొడుకు రమేశ్ జిల్లా కమిటీ సభ్యుడిగా, కూతురు లావణ్య జనతన సర్కార్లో పనిచేస్తున్నట్లు సమాచారం. రెండు దశా బ్దాల క్రితం తండ్రి చనిపోయినపుడు కూడా స్వామి అజ్ఞాతంలోనే ఉన్నారు. అప్పుడు అంత్యక్రియలు రాలేదు. తల్లి చనిపోయిన విషయం ఆయనకు తెలిసే అవకాశం లేదు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించారు.

సాక్షి దినపత్రిక సౌజన్యంతో..

Death of mother of top Maoist leader / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment