మానవత్వం తో వ్యవహరించండి. స్మశానాల నిర్వాహకులతో మేయర్ వసీం

అనంతపురం.

కరోనా విపత్తు వేళ అంత్యక్రియలు నిర్వహణలో మానవత్వం తో వ్యవహరించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. గురువారం నగర పరిధిలోని స్మశానాల నిర్వాహకులతో మేయర్ వసీం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్మశానాల నిర్వాహకులతో పాటు హరిశ్చంద్ర ఘాట్ నిర్వాహకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరోనాతో అయిన వాళ్ళను కోల్పోయి ప్రజలు బాధపడుతుంటే అంత్యక్రియలకు ఇష్టారాజ్యంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.ఆప్తులు చనిపోయిన బాధకంటే అంత్యక్రియల సమయంలో తమకు ఎదురవుతున్న సమస్యలు బాధితులను త్రీవంగ కలచివేస్తున్నట్లు తమ దృష్టికి వస్తోందన్నారు.అలాంటి ఘటనలకు తావు లేకుండా మానవత్వం తో వ్యవహరించి అంత్యక్రియల విషయం లో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు.మరో వైపు అంబులెన్స్ ల నిర్వాహకులు కూడా ప్యాకేజీ లు నిర్ణయించి దందా చేస్తున్నట్లు వీటి విషయం లో సైతం కమిషనర్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి ఎలా వ్యవహరించాలో నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రమణా రెడ్డి,డి ఈ రాంప్రసాద్ రెడ్డి,సాయి ట్రస్ట్ నిర్వాహకులు విజయ సాయి,హరిశ్చంద్ర ఘాట్ ప్రతినిధి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

 

Comments (0)
Add Comment