Dare to file a treason case
కంగనా రనౌత్ పై దేశ ద్రోహం
కేసు పెట్టే దమ్ముందా..?
పద్మశ్రీ అవార్డులు.. దేశంలోనే వివిధ రంగాలలో సక్సెస్ సాధించిన వారికి ఇచ్చే అవార్డులు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం వచ్చిన తరువాత సామాన్యులు పద్మశ్రీ అవార్డులకు ఎంపికైతున్నారనే మాట వాస్తవం. కానీ.. ఆ ఎంపికలో కూడా కొన్ని తప్పులు జరుగడంతో సోషల్ మీడియాలో ట్రోల్ తీస్తున్నారు పబ్లిక్. పద్మశ్రీ అవార్డు గ్రహీత సినీ నటి కంగనా రనౌత్ స్వాతంత్ర్యం గురించి చేసిన వ్యాఖ్యాలు పెద్ద దుమారం రేపుతున్నాయి. దేశ భక్తి తమ హక్కుగా ప్రచారం చేసుకునే బీజేపీకి ఇప్పుడు కంగనా రనౌత్ తల నొప్పిగా మారింది.
స్వాతంత్ర్యం బిక్ష అంటూ..
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని మెచ్చుకోవడానికి ఏకంగా దేశానికి స్వాతంత్ర్యం బిక్ష అంటూ ప్రకటించిన కంగనా రనౌత్ పై ప్రతి పక్షలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఏమమ్మా..! కంగనా రనౌత్ స్వాతంత్ర్య సాధన ఒక భిక్షనా మీవాళ్ళు ఎవరైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఉందా? బ్రిటీషోళ్ళకి ఇన్ఫార్మర్లు గా మారారా? ఎందుకు ఈ స్వాతంత్ర్య పోరాట చరిత్రను వక్రీకరించి కలుషితం చేస్తున్నావు బుద్ధి ఉందా? ఆ పోరాట చరిత్రలో మీ కుహన దేశభక్తులు లేరని ఇలా నీచంగా మాట్లాడుతున్నారా? అర్థమైందిలే. పద్మశ్రీ పురస్కారం ఇలా కుక్కలా మొరగ మని ఆదేశించిందా? ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గు అనిపించలేదా..? అంటూ సోషల్ మీడియా వేధికగా దాడి చేసారు. బీజేపి ఎంపీ వరుణ్ గాంధీ సైతం కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించెలా ‘‘ఇది పిచ్చి అనాలా.. లేక దేశ ద్రోహం అనాలా’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. Dare to file a treason case
-
శాంతి ప్రియ