డి.హీరేహాళ్ మండలం కళ్యం గ్రామంలో మానవత్వాన్ని చాటుకున్న – ఎఎస్సై కాటయ్య ( ASI 351)

AP 39TV 08 ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం కళ్యం గ్రామంలో ఎఎస్సై కాటయ్య ( ASI 351) మానవత్వాన్ని చాటుకున్నారు. కళ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికల బందోబస్తు విధులకు కాటయ్యను పంపారు. ఆసందర్భంగా ఓ మహిళ తన చిన్నారిని వెంట ఎత్తుకొచ్చింది. ఓటు వేసేందుకు తల్లి వెళ్లడంతో చిన్నారి ఏడ్చింది. అక్కడే విధుల్లో ఉన్న ఏఎస్సై కాటయ్య ఆ చిన్నారిని ఎత్తుకుని లాలించి పోరు మాన్పించాడు. మానవత్వంగా వ్యవహరించిన కాటయ్యను చిన్నారి తల్లితో పాటు ఆ లొకేషన్ పరిసరాలలో ఉన్న ఓటర్లు, సిబ్బంది అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS కాటయ్య సేవలను ప్రశంసించారు.

Comments (0)
Add Comment