Created a new word for me (poetry)
నా కోసం కొత్త పదం సృష్టించాడు (కవిత్వం)
అతనో….(?)
కొత్తగా సృష్టించాడు అతను
నాకోసం ఓ కొత్తపదం..
ఒక జాతిని ఉద్దేశించినది కాదు
ఒక మతం గురించి పలికేది కాదు
ప్రాంతం గురించి వివరించేది కాదు
సభ్యత మరచి.
సంస్కారం గాలికి వదిలేసి.
తనో మనిషి అనే విచక్షణ కోల్పోతూ,
అధికార మదంతో.
కుల సమీకరణ బలంతో,
రాజకీయ కండువాలు కప్పుకుని.
ఓ రేయ్!”సంకర జాతి వెధవా!”అంటూ!
అతనికే తెలిసిన జాతి!
అతనికే తెలిసిన సంక్రమణం!
అతను మాత్రమే పలకగల హేయమైన పదం…
“సంకర జాతి వెధవా!”
పవిత్రమైన సృష్టి కార్యాన్ని
జగుత్సాకరమైన పదంతో పోల్చిన అతను
మనిషా!లేక……….?
నీవు పిలిచినంత మాత్రాన
నీవు దూషిస్తూ నావైపు చూసినంత మాత్రాన
నా పుట్టుక అపవిత్రం కాదు..
నీ మనసు,నీ నోరు మాత్రమే… తెలుసుకో…!!
Created a new word for me (poetry)
రాము కోలా, కవి
దెందుకూరు, ఖమ్మం 9849001201