Cow birthday celebration
ఆవు బర్త్ డే సెలబ్రెషన్
‘‘విష్ యు హెప్పి బర్త్ డే గంగా’’ చిల్డ్రెన్స్ ఖుషి ఖుషిగా బర్త్ డే చెబుతుందెవరికి అనుకుంటుండ్రా.. అగో నిలబడి అందరిని ప్రేమతో చూస్తున్న ఆవుకే బర్త్ డే చెబుతుండ్రు. ఆ ఆవు పేరే గంగా. సికింద్రబాద్ అల్వాల్ పంచశీల ఎన్ క్లూవ్ దర్శన్ ఆగర్వాల్ ఫ్యామిలీ ఆవు బర్త్ డే సెలబ్రెషన్ జరిపిండ్రు.
ఆవు అంటే ఆ ఫ్యామిలీకి ప్రేమ..
చంటి బిడ్డలా ఆవును సాధుతుండ్రు దర్శన్ ఆగర్వాల్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ ఆవును గోమాతగా భావించి ప్రతి రోజు దండం పెట్టుకుని తమ పనులు ప్రారంభిస్తారు. సోమవారం సాయంత్రం ఆవు షెడ్డులోకి వచ్చిన దర్శన్ ఆగర్వాల్ ఫ్యామిలీ బెలూన్స్ కట్టిండ్రు. ఆవుకు ఎర్రని దుస్తుల శాలువ కప్పిండ్రు. అరటి పండ్లు తెచ్చిండ్రు. పెద్ద కేక్ తెప్పించి కేక్ కట్ చేసిండ్రు. లైట్లు వెలిగించారు. ఆ కాలోని పిల్లలను పిలిపించిండ్రు. ఆ పిల్లలతో సాంగ్స్ పాడించిండ్రు. ఆవుకు పూల దండ కూడా వేసిండ్రు. నొసట బొట్టు పెట్టిండ్రు.
కేక్ కట్ చేసి గోమాతకు..
ఇంకేముంది కేక్ కట్ చేసి మొదట ఆవుకు దర్శన్ ఆగర్వాల్ తినిపించిండ్రు. బర్తే డే గురించి తెలియని ఆవు పిల్లలు, పెద్దలు ఎక్కువ మంది కనిపించడంతో బెదురు బెదురుగా చూస్తుంది. అయితే.. పిల్లలకు కేక్ తో పాటు సమోసాతో ఆ Cow birthday బర్త్ డే ప్రోగ్రాంకు అటెండైన వారందరికీ బిర్యానితో దావత్ ఇచ్చిండ్రు ఆ ఫ్యామిలీ మెంబర్స్. గోమాత బర్త్ డే చేయడం సంతోషంగా ఉందంటున్నారు లో పెరుష్ సేవా సమితీ వ్యవస్థాపకులు దర్శన్ ఆగర్వాల్. ఆవును దైవంగా భావించి ప్రేమించాలంటారు ఆయన. ఆనారోగ్యానికి గురైన వారికి ఆవు పాలు మెడిసిన్ లా పని చేస్తాయన్నారు.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
949 222 5111