ఏపీలో కోటిమందిని టచ్ చేసి వెళ్లిన కరోనా

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తో బిజెపి తెలంగాణ చేపట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఇందులో భాగంగా బిజెపి ‘చలో అసెంబ్లీ’ తలపెట్టింది. బిజెపి ప్రజాస్వామ్యయుత నిరసనలను కేసీఆర్ సర్కార్ అప్రజాస్వామికంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ పోలీసులను ప్రయోగించి నిర్బంధాలకు తెగబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది. గృహ నిర్బంధాలు చేయిస్తోంది.

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రజల డిమాండ్ ను ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాల్సిన అధికారిక ఉత్సవాలను విస్మరించిన కె.సి.ఆర్ ప్రభుత్వ తీరుపై వినిపించిన ప్రజాదిక్కార స్వరానికి నిదర్శనం బిజెపి చేపట్టిన చారిత్రక స్థలాల సందర్శన యాత్ర. సామాన్యుడి నాయకత్వ కేంద్రంగా సాగిన విమోచన ఉద్యమం నియంతృత్వ నిజాం సర్కారును భారత ప్రభుత్వం ముందు తలవంచి లొంగుబాటు అయ్యేలా చేసింది. బిజెపి నేతృత్వంలో సాగుతున్న ప్రజాందోళనలు మరోసారి ప్రస్తుతం కొనసాగుతున్న 8వ నిజాం మాదిరి అత్యంత అవినీతి, దోపిడీ, నియంతృత్వ,నిరంకుశ కె.సి.ఆర్ పాలనపై ప్రజా విజయం త్వరలోనే సాధిస్తుంది.రాబోయే 2023 ఎన్నికల అనంతరం ఏర్పడబోయే బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాము అని అలంపూర్ బీజేపీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ముందుస్తూ అరెస్ట్ లు చేసారు పోలీసులు. అరెస్టైన వారిలో bjp జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్, యువమోర్చా రాష్ట్ర నాయకుడు రాజశేఖర్ శర్మ, వడ్డేపల్లి bjp పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, వడ్డేపల్లి bjp పట్టణ ఉపాధ్యక్షుడు మోహన్ యాదవ్ ఉన్నారు.

Tags: Corruption, exploitation, dictatorial, totalitarian regime

Comments (0)
Add Comment