అన్ని మౌలిక వసతులతో జగన్ అన్న కాలనీ లలో ఇళ్లు నిర్మాణము – మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

AP 39TV 04 జూన్ 2021:

నవరత్నాలు పెదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా జి వి సత్రం లోని జగనన్న కాలనిలో ఇళ్ల నిర్మాణానికి మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వమే అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నదని తెలిపారు. ఇంటి స్థలాల పంపిణీ ఇప్పటికే పూర్తి అయినది. ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉన్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో మైదుకూరు మునిసిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర,ఎమ్మార్వో ప్రేమంత్ కుమార్,సి ఐ చలపతి , జెడ్పీటీసీ ఏవి సుబ్బారెడ్డి ,వైస్సార్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

 

 

 

 

Comments (0)
Add Comment