CM KCR GO 317 song
ముఖ్యమంత్రి కేసీఆర్.. జీవో 317 పాట
పుష్ప సినీమాలో ఐటం సాంగ్ సోషల్ మీడియాలో భలే వైరల్ అయ్యింది కదూ. ఇగో ఇప్పుడు అదే స్టైల్ లో టీచర్ మహేశ్ గంగాధరి ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 317 పై రాసిన పాట వైరల్ అవుతుంది. ఆ జీ.వో తీయడం వల్ల తాము ఎదుర్కొనే ఇబ్బందులను, కష్టాలను నా సామి.. బంగరు సామి.. సి ఎం సామి సి ఎస్ సామి.. అంటూ పాడుకుంటున్నారు. ఆ పాట వింటుంటే… ఇంకెందుకు ఆలస్యం మీరు రాగం తీసి పాడుకొండి..
ముఖ్యమంత్రి కేసీఆర్.. జీవో 317 పాట
నువ్వు లోకల్ లోకల్ అంటంటే
మా పీకల మీదికే వచ్చేసిందిగా సామీ నా సామీ..
ఈ మూడు పదిహేడు జీ వో వచ్చీ
ముల్లోకాలూ తిప్పినట్లుందిగా సామీ నా సామీ
నే వందల మైళ్ళు వెళ్లోస్తంటే నే వందల మైళ్ళు వెళ్లోస్తంటే
వైకుంఠ ధామం చేరినట్టుందిరా సామీ
నే ఏగిలివారంగ లేసెల్లుతుంటే
ఆగం శివరాత్రి అయినట్టుందిగా సామీ
నే నెళ్ళే దారి సూత్తా ఉంటే
సొమ్మ సిళ్లి తిప్పినట్టుందిరా సామీ
సామి నా సామి
నా సామి
చూడూ సామి సామి
బంగరు సామి సి ఎం సామి సి ఎస్ సామి
నా సామి
సూడు సామి సామి
బంగరు సామి సి ఎం సామి సి ఎస్ సామి
ఫికరు పడుతూ
పాఠం మొదలు పెడితే
ఫికరు పడుతూ
పాఠం మొదలు పెడితే
నే పిస పిస పలికినట్టుండెను సామీ
పేజీ పేజీ దన ధన చదువుతుంటే
నే ఘోరం ఏదో చేశాను సామీ
తెలుగు లెక్కలు అర్థం కాకా
తెలివి తప్పెను సామీ
సైన్సు సోషల్ సమజు కాక
మనసు కెక్కగలదా సామీ
మా పిల్లా జెల్లలు యాదికి వచ్చీ.. ఆ..
మా పిల్లా జెల్లలు యాదికి వచ్చీ పీనుగోలైతి సామీ
నెమ్మది లేక పాఠం సాగదు సామీ
మా మనసు మొత్తం చిందర ఉంటే
ఈ బడులు అన్నీ కుప్పై పోవా సామీ
సామి నా సామి
నా సామి
సామి చూడూ సామి
బంగరు సామి సి ఎం సామి సి ఎస్ సామి
నా సామి
సూడు సామి సామి
బంగరు సామి సి ఎం సామి సి ఎస్ సామి
సామి నా సామి
నా సామి
సామి చూడూ సామి
బంగరు సామి సి ఎం సామి సి ఎస్ సామి
నా సామి
సూడు సామి సామి
బంగరు సామి సి ఎం సామి సి ఎస్ సామి
కొత్త డీ ఏ వచ్చీ పడితే
ఇట్టె నువ్వు ఇవ్వాకుంటే
కొత్త డీ ఏ వచ్చీ పడితే
ఇట్టె నువ్వు ఇవ్వాకుంటే
పొట్ట మీద మన్నే చేరద సామీ
అప్పులన్నీ పేరుకుంటే
జెప్పున అవి కట్టాకుంటే
బాధలో గుండే భారమవదా సామీ
మా పదోన్నతులు ఇవ్వక నువ్వు . ఆ..
మా పదోన్నతులు ఇవ్వక నువ్వు పక్కన పెడితే సామీ
మా కంటా నీరే ఏరై పోదా సామీ
నా సర్వీసు మొత్తం ఒక్కటే ఉంటే
పంతులు పుట్టుక బీడై పోదా సామీ
సామి నా సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి సి ఎం సామి సి ఎస్ సామి
నా సామి
సూడు సామి సామి
బంగరు సామి సి ఎం సామి సి ఎస్ సామి