రాజమండ్రి సభలో సీఎం జగన్ ప్రసంగం

రాజమండ్రి :

పెన్షన్ సొమ్మును పెంచుకుంటూ పోతామని చెప్పిన మాటను నిలబెట్టుకుని నెలకు రూ.2,750 కి పెంచామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

వితంతువులకు,అవ్వా తాతలకు,చేనేతలకు,మత్స్యకారులకు,ఒంటరి మహిళలకు,ఎయిడ్స్ వ్యాధిగ్రస్దులకూ ఇలా 64 లక్షల మందికి ఈ పించన్ పెంపు వర్తిస్తుందన్నారు.

పుట్టుకతో అంగవైకల్యానికి గురయినవారికి,దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాదులున్నవారికి,డయాలసిస్ పేషెంట్లకు,ఇలా నిరుపేదలందరికీ పెన్షన్లు ఇస్తున్నామన్నారు.

దేశం లో ఎక్కడా లేని విదంగా పెన్షన్ సొమ్మును 2,750 నుండి ఏకంగా 10 వేలవరకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. ఏడాదిలో రెండుసార్లు అర్హులను గుర్తించి…కొత్తగా అర్హులయినవారికి బియ్యం కార్డులు,ఆరోగ్యశ్రీ కార్డులు,ఇళ్ళ పట్టాలు అందిస్తున్నాం

ఇలా మరో 44,543 బియ్యం కార్డులు ఇస్తున్నాం.. మొత్తం బియ్యం కార్డులు 1,45,88,539 ఉన్నాయి

అలాగే కొత్తగా మరో 14,401 ఆరోగ్యశ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మొత్తం ఆరోగ్యశ్రీ కార్డులు 1,41,48,249 కి చేరాయి. మరో 14,531 ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం. ఇలా మొత్తం ఇళ్ళ పట్టాలు 30,29,171 ఇచ్చామని వివరించారు జగన్.

గత ప్రభుత్వం దిగిపోయేనాటికి 2019 ఎన్నికలకు రెండు నెలల ముందువరకు పెన్షన్ వెయ్యి రూపాయలిచ్చేవారన్నారు ఆయన. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి ఎన్నికలకు 6 నెలలముందువరకు వారిచ్చిన పెన్షన్లు కేవలం 39 లక్షలే . ఈరోజున మన ప్రభుత్వం 64 లక్షల 6 వేల పెన్షన్లు ఇస్తుందన్నారు. గత ప్రభుత్వం పెన్షన్లకు చేసిన ఖర్చు నెలకు కేవలం 400 కోట్లే .మనం ఈరోజున నెలకు పెన్షన్ల కోసం 1,765 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇలా ఏడాదికి పెన్షన్లపై 21,180 కోట్లు ఖర్చు చేస్తున్నాం

కందుకూరులో 8 మందిని చంపిన బాబు..తన రక్త దాహం తీరక…గుంటూరులో ముగ్గురిని పొట్టనబెట్టుకున్నాడన్నారు సీఎం జగన్.

CM Jagan's speech in Rajahmundry Sabha
Comments (0)
Add Comment