Citimaar movie
సీటీమార్ సినిమా కొత్త ట్రెండ్
సమాజం లో జరుగుతున్నా ఒక సమస్యని ప్లాట్ ఫాయింట్ గా తీసుకుని సినిమా తీసేవారు. దానికి కమర్షియల్ హంగులు అద్దటం పాత పద్దతి. కానీ సిటీమార్ సినిమా టోటల్ గా డిఫరెంట్. మనం రోజూ స్పోర్ట్స్ పేపర్ లలో కనిపించే న్యూస్ లలో చూసే ఒక ఆటను తీసుకుని కమర్షియల్ హంగులు అద్దటం సిటీమార్ సినిమాలో కొత్త ట్రెండ్ గా కనిపించింది. ఆ ఆటని ఆడ వారి చేత ఆడిస్తే కావలసినంత ఎమోషన్, కావలసినంత గ్లామర్.
లాజిక్కులు మరువద్దు
కధ రాసేప్పుడు, సినిమా తీసేప్పుడు కొన్ని అంశాలని కొన్ని లాజిక్కులని సరిగ్గా డీల్ చేయటం మరువకూడదు. ప్రేక్షకుడు ప్రతీ సీన్ నీ, ప్రతీ ఎమోషన్ ని బేరీజు వేసుకుంటూ సినిమా చూస్తుంటాడు. ఉదాహరణకు Citimaar movie సిటిమార్ సినిమాలో కబడ్డీ జట్టులో ఆడే ఆడపిల్లలు ఒక రాత్రి తమ ఇళ్ళకి వెళ్ళేటపుడు ఆరుగురు పోకిరీ వెధవలు ఏడిపిస్తుంటారు. హీరో వచ్చి వాళ్ళని చితక్కొడతాడని ఎదురుచూసే ప్రేక్షకుడికి సడన్ గా ఆ అమ్మాయిలే వీరొచితంగా పోరాడి ఆ ఆరుగురికి దేహశుద్ది చేస్తారు. కాళ్ళు చేతులు విరిచి హీరోయిజంతో వెళ్ళిపోతారు. సూపర్.
ఢిల్లీలో కంటైనర్ లో ఆడపిల్లలని ఒక్కడే తిప్పుతుంటాడు. మల మూత్రాలకి ఆపినపుడు ఆడపిల్లలు దిగి, వాణ్ణి చావ బాది వాడి దగ్గర ఫోన్ లాక్కుని హీరోకి ఫోన్ చేయొచ్చు. పైన సీన్ లో ఆరుగురిని కుళ్లబొడిచిన వీళ్ళకి ఒక్కణ్ణి కొట్టటం పెద్ద సమస్య కాదు. కానీ అలా చేయరు. ఇది చూసే ప్రతి ప్రేక్షకుడికి కలిగే అనుమానం. ఆడపిల్లలు మల మూత్రాలకి దిగినపుడు చుట్టూ ఒక నాలుగు కార్లలో గన్నులు పట్టుకుని రౌడీలు ఉంటే పైన వచ్చిన డౌట్ ప్రేక్షకుడికి రాదు. అంత మందిని ఆ ఆడపిల్లలు ఎదిరించలేరు. పైగా వాళ్ళ చేతుల్లో గన్నులు వున్నాయని లాజిక్ గా ప్రేక్షకుడికి అనిపిస్తుంది. Citimaar movie
రిచ్ మెన్ లోన్ కట్టలేడా..?
సినిమా కథలోకి వెళ్లితే.. రావు రమేష్ గారికి నాలుగు పెద్ద పెద్ద కారులు ఉంటాయి. చుట్టూ ఇరవై మంది రౌడీలు ఉంటారు. చుట్టూ పొలాలు వాటి మధ్య పెద్ద ఇల్లు. అతన్ని ఒక రిచ్ మ్యాన్ గానే చూపిస్తారు. మరి రైస్ మిల్ కి కట్టాల్సిన నెలవారి లోన్ ఎందుకు కట్టట్లేదు చెప్మా? అంత డబ్బున్నవాడు కేవలం నెల నెల కట్టే బ్యాంక్ లోన్ కోసం హీరోతో గొడవ పడటం అస్సలు మింగుడు పడని విషయం.
ఎమోషన్ తో ప్రేక్షకుడి మనసులో
ఈ Citimaar movie సినిమా ట్రైలర్ లో చూపించింది ఒకటి. థియేటర్ లో చూపించింది మరోకటి. ఎమోషన్ అనేది ప్రేక్షకుడి మనసులోకి గురి చూసి కొట్టాలి. అది సరిగ్గా తగిలితే సినిమా గొప్పగా ఉంటుంది. ఇందులో అనవసరపు లెంగ్త్ డైలాగ్స్, అక్కా, బావ, ఎమోషన్స్ అస్సలు పండలేదు. కబ్బడ్డి టీమ్ పిల్లల తల్లి తండ్రుల నటన ఓవర్ గా అనిపించింది. డైరెక్టర్ కొన్ని పాత్రల ద్వారా కామెడీ పండిద్దాం అనుకున్నాడు. కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇది వరకు నే చెప్పినట్టుగానే ” సినిమా కథ బలంగా ఉండక పోయినా పర్వాలేదు, సినిమాలో నాలుగు సీన్ లు బలంగా, ఎమోషనల్ గా ఉంటే చాలు అనుకునే దర్శక, రచయితలు ఎక్కువ అయిపోతున్నారు”.అనిపించింది.
M. Rk