Children without family names
ఇంటి పేర్లు లేని పిల్లలు.. !
పేరుకు ముందు ఇంటి పేరు తప్పని సరి.. ఆ మారు (ఇన్సాల్) పేరు లేకుండా ఆ వ్యక్తిని గుర్తించడం కష్టమే. ఎవరి వంశం అంటే ఫలాన వంశం అంటూ మారు (ఇంటి) పేరు చెబుతారు. ఆ మారు పేరు లేకుండా పేర్లు ఉన్నాయంటే నమ్మలేని నిజమే.. కానీ.. నిజామాబాద్ జిల్లా ధర్ పల్లి మండల కేంద్రానికి చెందిన మానవతవాది చెలిమెల రాజేశ్వర్-పద్మల మనుమళ్లకు ఇంటి పేరు తొలగించి పేరులనే రికార్డులలోకి ఎక్కించారు.
సీన్ కట్ చేస్తే..
చెలిమెల రాజేశ్వర్-పద్మ దంపతులు ఆధర్శంగా జీవించాలని నిర్ణయించి తామే అమలు చేస్తున్నారు. సమాజాన్ని పట్టి ఫీడిస్తున్న మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్య వంతులను చేస్తునే తరతరాలుగా వస్తున్న పనికి రాని ఆచరాలకు దూరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. శాస్త్రీయ పద్దతిలో జీవించాలని హీతవు చెప్పే ఆ రాజేశ్వర్ – పద్మలు ఇప్పటికే తమ పిల్లలను ఆధర్శంగా తీర్చి దిద్ది ఆచరణలో సమాజానికి రోల్డ్ మోడల్ గా చూపిస్తున్నారు. Children without family names
ఇంటి పేరు గురించి రాజేశ్వర్ మాటల్లోనే..
పెద్దవాళ్ళను తమ ఇంటి పేరు తీసి వేసుకోండి అని నేను చెప్పదలుచు కోలేదు. ఎందుకంటే, ఈ దశలో వారు పేరు మార్చుకున్నా జనంలో confuse create చేయడం తప్ప పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు కాబట్టి. ఇంటి పేర్ల విషయంలో కండ్లు తెరవమని, జాగ్రత్త పడుమని నేను విజ్ఞప్తి చేస్తున్నది కేవలం యువతరానికే. కాబట్టి యంగ్ జనరేషన్ (యువతీ, యువకులు) ఆలోచించాలి.
తలకొరవి పెట్టేది మగవాడే..
“మఖ్యంగా, వంశం పేరు నిలిపేది “మగ” వాడే తల్లి, దండ్రులకు తలకొరవి పెట్టేది “మగ” వాడే.. తల్లి, దండ్రులకు గంజి పోసే భాధ్యత “మగ” వాడితే. ఆస్తికి వారసుడు మగ వాడే.” లాంటి అభిప్రాయాలు సమాజంలో స్తిరపడటానికీ, ఇంటి పేరు కొనసాగింపుకూ సంబందం ఉంది. ఆ కారణం గానే ఆడ సంతానం బదులు మగ సంతానం కావాలని కోరుకునే స్తాయికి నేటి సమాజం దిగజారి పోయింది. ఇది గర్భస్త “ఆడ” పిండాల అబార్షన్లకూ, అపుడే పుట్టిన “ఆడ” శిశువుల హత్యలకూ దారితీసింది. Children without family names
అమ్మాయల పుట్టుక “మైనస్’’
అమ్మాయల పుట్టుక “మైనస్” అని అబ్బాయిల పుట్టుక “ప్లస్” అని బహిరంగంగా చర్చించుకునే పరిస్తితి దాపురించింది.ఈ పరిస్తితి మారాలి అంటే మనం దాని మూలాల్లోకి వెళ్లాలి. అందుకు యువతరం పూనుకోవాలి. భవిష్యత్తులో ఎవరికీ ఇంటి పేర్లు ఉండ రాదు. సమస్య (పరష్కారానికి) ఇదొక్కటే కారణం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. కాని ఎక్కడో ఓ చోట మొదలు కావాలి కదా… ప్రస్తుతానికైతే మనం ఇంటి పేర్ల పని పడదాం.
మన మాట ఎవరూ వినక పోవచ్చు
ఇదంత సులభం కాదు. మన మాట ఎవరూ వినక పోవచ్చు. మనల్ని పిచ్చి వాల్ల కింద జమ కట్ట వచ్చు. పర్వాలేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. మా పిల్లలు ఆ ప్రయత్నం చేశారు. వాళ్ళు తమ పిల్లలకు వారి ఇంటి పేర్లు లేకుండా/ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే.. తల్లిదండ్రుల ఇంటి పేర్లు లేకుండానే వారు తమ పిల్లలకు పేర్లు పెట్టేశారు.
ఫోటోస్: ఇంటి పేర్లు లేని.. మా “సహేత్” & “పురట్చి” ! Children without family names