కరోనా కష్టకాలంలో దాతృత్వ సేవ – వైసీపీ యువనాయకుడు ఆలూరు ఎర్రి స్వామిరెడ్డి

AP 39TV 05 మే 2021:

కన్నయ్య కుమారుడు వరుణ్ ఊపిరి తిత్తులవ్యాధితో బాధ పడిన విషయం అందరికి తెలిసిందే. కన్నయ్య తనకి మించిన భారమైనా..అందిన చోటల్లా అప్పులు చేసి చికిత్స చేయించాడు. ఈ సమయంలో ఆ కుటుంబానికి అండగా మేమున్నాం అంటూ సామాజిక మధ్యామాల్లో పలువురు స్పందించారు. సుమారు రూ.80 వేలు విరాళాల రూపంలో వచ్చాయి. అయితే వైసీపీ యువనాయకుడు ఆలూరు ఎర్రి స్వామిరెడ్డి ముందుకు వచ్చి రూ.20 వేల సహాయం అందించారు.అయితే ఇవన్నీ కలిపి మొత్తం ఒక లక్ష రూపాయలని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి ద్వారా కన్నయ్య కుటుంబానికి అందజేశారు.ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి  మాట్లాడుతూ ఇలా మానవత్వంతో స్పందించి దాతలు ముందుకు వచ్చి సహాయం అందించినందుకు అభినందించారు.కన్నయ్య కుటుంబానికి సహాయపడిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.

 

 

Comments (0)
Add Comment