Cell phone satirical parody song సెల్ ఫోన్ వ్యంగ్యంగా పేరడీ పాట

Cell phone satirical parody song
సెల్ ఫోన్ వ్యంగ్యంగా పేరడీ పాట

ఊ అంటావా బాసు
ఊ ఊ అంటావా బాసు.!!

మేడం మేడం మేడం అంటూ
మార్నింగ్ మెసేజ్ పెడతారు..
ఇంకా బజ్జోలేదా అంటూ
రేతిరి బాధ పడతారు..

పగలూ కాదు రాతిరి కాదు
కాలం లోన ఏముంది?
మీ చేతుల్లోనే సెల్లు ఉంది
ఒళ్ళు కాస్త తిమ్మిరిగుంది..

ఊ అంటావా బాసు
ఊ ఊ అంటావా బాసు..!!

టిక్కు టిక్కు లైకులతోనే
బిక్కు బిక్కు చూస్తారు..
పోస్టుపోన్ చెయ్యకుండా
పోస్టులు షేర్ చేస్తారు..

లైకూ కాదు షేరూ కాదు
పోస్టుతో పని ఏముంది?
ఫోటో కనిపిస్తే చాలండి
మేటర్ చదివే టైమేడుంది??

ఊ అంటావా బాసు
ఊ ఊ అంటావా బాసు..!!

కస్సుబుస్సుమంటూనే మరి
మిస్సవుతున్నామంటారు..
చూడాలనిపిస్తుందంటూనే
చిత్రాలెన్నో పెడతారు..!!

మిస్సు కాదు మిసెసూ కాదు
ఆడో మాగో చూడండి..
అదీ తెలీని పక్షంలో మరి
తేడాగాళ్లని తరమండి..!!

ఊ అంటావా బాసు
ఊ ఊ అంటావా బాసు..!!

డీపీ ఊపుగా ఉందనగానే
వెంటనే రిక్వెస్ట్ పెడతారు..
ఓకే చేసీ చేయంగానే
హాయ్ అని మెసేజు పెడతారు..

డీపీ కాదు తోపూ కాదు
ఒళ్ళు బలుపంటారండి..
తిన్నది అరగక వేషాలేస్తే
తిన్నగ పరువు పోతుందండీ..

ఊ అంటావా బాసు
ఊ ఊ అంటావా బాసు..!!

తాజా తాజా ఫోటోలతోని
స్టేటస్ అప్డేట్ చేస్తారు..
తేడా కామెంట్ వచ్చిందంటే
స్టేటస్ పోయిందంటారు..

సెల్ఫీల్లోన ఫోజుల్లోన
తత్వం కనపడబోదండి..
బేరం పెట్టి వేలం వేసే
అంగడి సరుకు కాదండీ..!!

ఊ అంటావా బాసు
ఊ ఊ అంటావా బాసు..!!

కాస్త చొరవ దొరికిందంటే
నెత్తిన కూసుంటారండి..
నమ్మీ నిజాలు చెప్పారంటే
నరకం చూపిస్తారండి..

ఆడా కాదు మగా కాదు
అపరిచితులను నమ్మొద్దండి..
అవసరంటూ తీరిందంటే
అందరి బుద్ది ఒకటేనండి..!!

ఊ అంటావా బాసు
ఊ ఊ అంటావా బాసు..!!

సీటికి మాటికి ఫోనులు చేస్తూ
ప్రాణం తీసేస్తారండి.
వేళాపాలా లేకుండానే
మెసేజిలేస్తుంటారండి..

హద్దులు దాటి ఉన్నారంటే..
సైబర్ క్రైమ్ ఉందండీ..
ఒక్క కాల్ చేయంగానే…
మక్కీలేరేస్తారండీ…!!

సక్కంగుంటావా బాసు..
సెల్లోకెళ్తావా బాసు..!!

ముఖపేజీల్లో ముసుగులు ఏల
మంచిగ స్నేహం చేయండి..
కుదరకపోతే వదిలేయండి
కక్షల జోలికి పోకండి..!!

అల్లరిచిల్లరి వేషాలేసి
అభాసుపాలు కాకండి..
అర్ధం చేసుకు మసలామంటే
అందరమొకటే జాతండి..!!

ఊ అంటావా బాసు
ఊ ఊ అంటావా బాసు.!!

నోట్ : సరదాగా తీసుకోవాలండోయ్..
ఇది ఎవరినీ ఉద్దేశించి కాదు.. డా. జగదీష్ గారి పోస్ట్ చూసాక పేరడీగా రాసానంతే.)

అమ్ము బమ్మిడి, జర్నలిస్ట్

Cell phone satirical parody song /zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment