చిత్రకళ
Cartoonist cum Journalist Paidy Srinivas
కార్టూనిస్ట్ కమ్ జర్నలిస్టు పైడి శ్రీనివాస్
ఫొటోషాప్ కార్టూన్లు.. ఈయన ప్రత్యేకత *సాక్షి టివి’ డింగ్ డాంగ్ ‘ రచయిత ఈయనే. సేవ్ గర్ల్ చైల్డ్ ‘ ప్రోమోకు యూనిసెఫ్ అంతర్జాతీయ అవార్డు కైవశం. ఈయన పేరు “పైడి శ్రీనివాస్ “పుట్టింది, పెరిగింది, చదువు కున్నది వరంగల్ లో. కేవలం చిత్రకారుడు కార్టూనిస్ట్ మాత్రమే కాదండోయ్. జర్నలిస్టు,రచయిత కూడా (Artist,Cartoonist,Writter,Journalist, Paidy Srinivas from Warangal, Telangana State,India)
మల్లిక్ ప్రేరణతో కార్టూనిస్ట్
మూడు దశాబ్దాలుగా కార్టూన్లు వేస్తున్నాడు. ట్వంటీ ఇయర్స్ జర్నలిజం,రచన,థర్టీ ఇయర్స్ కార్టూన్స్ వందకు ఫొగా జోక్స్ ఈయన ట్రాక్ రికార్డ్. బి.ఎ,బి.సి.జె చేశారు. ఈ టీవీ 2, సాక్షి టీవీ, వార్త లో పనిచేశారు. చదువుకునే రోజుల నుంచే వ్యాస రచన,చిత్రకళల పోటీల్లో ప్రథమ విజేతగా నిలిచాడు. ఈయన కార్టూనిస్ట్ కావడానికి మల్లిక్ ప్రేరణ. ఆంధ్రభూమి వారపత్రికలో మల్లిక్ కార్టూన్ లు చూస్తూ ఎదిగాడు.కార్టూ
నిస్ట్ అయ్యాడు.తన మొదటి కార్టూన్ 1990 లో జాగృతిలో అచ్చయింది. Cartoonist Paidy Srinivas
జోకుల రాయుడు
జోకులేస్తాడు. హ్యూమర్ ఈయన సొంతం. ఆంధ్రభూమి వారపత్రిక, వార్త దినపత్రిక చెలి పేజీలో వంద వరకు జోక్స్ రాశాడు. వార్త దినపత్రిక వరంగల్ ఎడిషన్లో కొన్నాళ్ళు రిపోర్టర్‌గా పనిచేశాడు. అక్కడ డెస్క్ బాధ్యుల్లో ఒకరైన శంకర్‌రావ్ శెంకేసి గారు ప్రతివారం జిల్లా అనుబంధంలో శ్రీనివాస్ కార్టూన్లు ప్రచురించి వెన్నుతట్టి ప్రోత్సహించారు. 2003లో ఈనాడు జర్నలిజం స్కూల్ లో శిక్షణ పూర్తి చేసుకుని ఈటీవీ 2 లో సబ్ ఎడిటర్‌గా చేరాడు. ఉద్యోగంలో చేరాకా పత్రికలకి కార్టూన్లు వేయటం కుదరలేదు. అయినా కార్టూన్లు, బొమ్మల ప్రాక్టీస్ మాత్రం మానలేదు.
అంతర్జాతీయ అవార్డూ
కేవలం కార్టూన్ లు వేయడమే కాదు. వాటికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా రాస్తాడు. కార్టూన్‌లో రాసే వ్యాఖ్య విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట తన కార్టూన్లు చాలా గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయని మిత్రులు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా సంతోషంగా వుంటుందన్నారు. సాక్షి టీవీలో ధర్మవరపు సుభ్రహ్మణ్యం గారు హోస్టుగా ‘డింగ్ డాంగ్’ పేరుతో ఐదేళ్లు నిర్విరామంగా ప్రసారమైన రాజకీయ వ్యంగ్య కార్యక్రమ రచయిత శ్రీనివాసే ఆ కార్యక్రమానికి రెండుసార్లు నేషనల్ టెలివిజన్ అవార్డు దక్కింది. సేవ్ గర్ల్ చైల్డ్ అంశంపై రూపొందించిన ప్రోమోకు unicef వారి నుంచీ అంతర్జాతీయ అవార్డూ లభించింది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు హాస్యానందంతో కలిసి నిర్వహించిన కార్టూన్ పోటీలో శ్రీనివాస్ కార్టూన్లు బహుమతి పొందింది. (Cartoonist Paidy Srinivas)
శ్రీనివాస్ వేసిన కొన్ని కార్టూన్లు
2018లో బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి మరణం పై న్యూస్ ఛానల్స్ రిపోర్టర్లు చేసిన అతి మీద ఒక కార్టూన్ వేసి ఫేస్ బుక్‌లో పోస్టు చేస్తే అది విపరీతంగా వైరల్ అయ్యింది. అప్పటినుంచి రెగ్యులర్‌గా కార్టూన్లు వేసి ఫేస్బుక్‌లో పోస్టు చేస్తున్నారు. 2018 లో తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఏర్పాటు చేసిన కార్టూన్ ప్రదర్శనలో వీరి కార్టూన్ కూడా వుంది. ఆ సందర్భంగా అనేక మంది కార్టూనిస్టులని కలుసుకునే అవకాశం కలిగింది అన్నారు. ఈ టీవీ 2 లో పనిచేసేటప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ గారిని కలిశారు. శ్రీనివాస్ వేసిన కార్టూన్లు చూసి ఆయన కొన్నిసూచనలు చేశారట.!
కార్టూనిస్టు సునీల గారు
కార్టూనిస్టు సునీల గారు ఫోటో షాప్ లో కొన్ని మెళకువలు చెబుతూ తనకోసం ప్రత్యేకంగా ఒక వీడియో
రూపొందించి పంపించారు. అప్పటినించీ ఈయన ఫోటో షాప్ లో కార్టూన్లు వేస్తున్నారు. తన కార్టూన్ల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోగలిగానంటారు పైడి శ్రీనివాస్. వరంగల్ కార్టూనిస్టు పైడి శ్రీనివాస్ కు అభినందనలు.