C. Pullaiah considered cinema as his life సినిమానే జీవితంగా భావించిన సి. పుల్లయ్య

Pullaiah considered cinema as his life సినిమానే జీవితంగా భావించిన సి. పుల్లయ్య

  • అక్టోబర్ 6న చిత్తజల్లు పుల్లయ్య వర్ధంతి

 

సి. పుల్లయ్యగా పేరుగాంచిన చిత్తజల్లు పుల్లయ్య (1898 – అక్టోబర్ 6, 1967) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత. కాకినాడ వాస్తవ్యుడైన ఆయన బి. ఎ చదివి జాతీయ భావం ప్రభావంతో 1920వ దశకంలో కాంగ్రెస్ లో చేరడం కోసం కలకత్తా వెళ్ళాడు. అక్కడ బులుసు సాంబ మూర్తి సలహా మేరకు ఫిలిం లేబరేటరీలో చేరాడు. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని శాఖల్లో పనిచేశాడు. తెలుగు చలన చిత్ర పితా మహుడి కుమారుడైన రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్. ఎస్. ప్రకాష్ దగ్గర భీష్మ ప్రతిజ్ఞ (1921) అనే మూకీ సినిమాకు సహాయకుడిగా పని చేశాడు.

ఆ తర్వాత సినీ నిర్మాణానికి కావలసిన సామాగ్రిని తన స్వస్థల మైన కాకినాడకు తీసుకు వచ్చి ఇంట్లోనే సెట్లు వేసి మార్కండేయ అనే సినిమా తీశాడు. దాన్ని ప్రదర్శించడం కోసం కాకినాడలో స్వంతంగా సిటీ ఎలక్ట్రిక్ అనే పేరుతో టెంటు హాలు కట్టాడు. ఇందులో చాలా మూకీ సినిమాలు ఆడాయి. సినిమా థియేటర్ ను ఒక ఉద్యమం లాగా చేపట్టి గుడారాలు, ప్రొజెక్టర్లూ, కుర్చీలు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోనే కాక బెంగాల్, ఒరిస్సాలలో కూడా ఊరూరా తిరిగి వాటిని ప్రదర్శించాడు. టాకీ సినిమాలు రాగానే ఆయన దృష్టి చిత్ర నిర్మాణం మీద పడింది.

C. Pullaiah considered cinema as his life

1933 లో సతీ సావిత్రి సినిమా తీశాడు. అది మంచి విజయం సాధించింది. తర్వాత లవకుశ చిత్రం తీశాడు. అది కూడా మంచి విజయం సాధించింది. కలకత్తాకు చెందిన ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు, ఈయన రూప కల్పనలో అన సూయ, ధృవ విజయం (1936) అనే చిత్రాలు తీసి రెండింటినీ కలిపి ఒకే సినిమాగా విడుదల చేశాడు. చిత్తజల్లు పుల్లయ్య 1898లో కాకినాడలో జన్మించాడు. చిన్న నాటి నుండీ చాలా చురుకైన వాడిగా ఎదిగాడు. 1921 లో ఆయన బి.ఎ.చదువు తున్న సమయంలో కాకినాడలో జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు వెళ్లిన పుల్లయ్య మీద జాతీయ భావాల ప్రభావం పడింది. వెంటనే ఇంగ్లీషు చదువుకు స్వస్తి చెప్పి, ఖద్దరు దుస్తులు కట్టడం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ సేవాదళంలో చేరేందుకు బొంబాయి వెళ్లాడు. రఘుపతి వెంకయ్య, ఆయన కుమారుడు రఘుపతి ప్రకాష్ దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సినిమా నిర్మాణ సంస్థ ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగ చిత్రాన్ని నిర్మించారు.  (ఇది మూగచిత్రం గనుక “మొదటి తెలుగువాడి సినిమా” అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించాడు. ‘డి కాస్టెల్లో’ (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుల్లయ్య కాకినాడలో ‘భక్త మార్కండేయ’ మూక్తీ చిత్రాన్ని 1925 లో నిర్మించి విడుదల చేసాడు. ఒక తెలుగు వాడు ఆంధ్ర దేశంలో నిర్మించిన మూకీ ‘భక్త మార్కండేయ’. ఇందులో పుల్లయ్య యమునిగా నటించాడు. అక్కడ కాంగ్రెస్ నాయకుడు బులుసు సాంబమూర్తి సలహా మేరకు ఫిలిం లేబరేటరీలో చేరాడు. రెండు పూటలా భోజనం పెట్టి, నెలకు ఐదు రూపాయల జీతం ఇచ్చేవారు. అక్కడే సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ నేర్చు కున్నాడు. అయితే, కొన్నాళ్లకు ల్యాబ్ దివాళా తీసి మూతపడే పరిస్థితి రావడంతో, పుల్లయ్యకు ఇవ్వాల్సిన జీతం బదులు ఓ సెకండ్ హ్యాండ్ కెమెరా, ప్రొజెక్టరు, ఫిల్ములు ఇచ్చి పంపించి వేశారు నిర్వాహకులు. వాటిని తీసుకుని కాకినాడ చేరాడాయన. కెమెరా చేతిలో ఉండడంతో సినిమా తీయాలన్న కోరిక కలిగింది. తమ ఇంటి రేకుల షెడ్డులో సెట్లు వేసి, ‘భక్త మార్కండేయ’ సినిమా తీయ డానికి ప్లాన్ వేశారు. అందులో తను యముడిగా కూడా నటించారు. కష్టపడి తీసిన సినిమాను తన ఇంట్లో చీకటి గదిలో గోడ మీద ప్రోజక్ట్ చేసి, తమ వీధిలోని వాళ్లందరికీ చూపించాడు. అయితే, ఆయనకు అది సంతృప్తిని ఇవ్వలేదు. సినిమా మెళకువలను ఇంకా నేర్చుకోవాలన్న తలంపుతో, తన కళాశాల ప్రిన్సిపాల్ రఘుపతి వెంకటరత్నం నాయుడు వద్ద సిఫార్సు లెటర్ తీసుకుని, మద్రాసు బయలు దేరాడు. అక్కడ వెంకట రత్నం నాయుడు సోదరుడు వెంకయ్య నాయుడు అప్పటికే సినిమా నిర్మాణంలో ఉన్నారు. ఆయన కుమారుడు ప్రకాష్ వద్ద పుల్లయ్య అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. రఘుపతి వెంకయ్యకు  థియేటర్లు కూడా ఉండేవి. కొన్నాళ్లకు వాటి ప్రదర్శన నిర్వహణను పుల్లయ్యకు అప్ప జెప్పారు. అప్పుడే ఆయన ఆ రంగంలో కూడా అనుభవం సంపాదించారు. టాకీ సినిమా వచ్చిన తర్వాత మళ్లీ పుల్లయ్య దృష్టి సినిమా మీదకు మళ్ళింది. అదే సమయంలో ఈయన గురించి తెలుసుకున్న కలకత్తాలోని ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు, తమ తెలుగు చిత్ర నిర్మాణ విభాగానికి ఇంచార్జ్ గా పుల్లయ్యను ఆహ్వానించారు.

 

ఈస్టిండియా కంపెనీకి ఆయన రూపొందించిన తొలి సినిమా ‘సతీ సావిత్రి’. ఆనాటి రంగస్థల ప్రముఖులు వేమూరి గగ్గయ్య, రామతిలకం అందులో నటించారు. తర్వాత దేవకీ బోస్ బెంగాలీలో ‘లవకుశ’ ప్లాన్ చేస్తుంటే, ఆ సబ్జక్ట్ పుల్లయ్యను ఆకర్షించింది. దాంతో, ఆ కంపెనీకే దీనిని తెలుగులో తీయడానికి రెడీ అయ్యారు పుల్లయ్య. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి స్క్రిప్ట్ రాశారు. పారుపల్లి సుబ్బారావు, సీనియర్ శ్రీరంజని ఇందులో సీతారాములుగా నటించారు. రథాలు, సెట్లు, కాస్ట్యూమ్స్ వంటి వాటిని బెంగాలీ వెర్షన్

కి వాడిన వాటినే వాడారు. 1934 లో విడుదలైన సినిమా గొప్ప విజయం సాధించింది. 1963లో ఇదే సినిమాను తన తనయుడు సి.యస్.రావుతో కలిసి పుల్లయ్య పునర్నిర్మించాడు. తెలుగులో తొలి రంగుల చిత్రంగా నమోదైన లవకుశలో ఎన్.టి.రామారావు, అంజలీదేవి సీతారాములుగా నటించగా, నాగయ్య వాల్మీకిగా నటించారు. పుల్లయ్య తీసిన అత్యంత విజయ వంతమైన చిత్రాలలో ఇదీ ఒకటి. పుల్లయ్య

C. Pullaiah considered cinema as his life

భువన సుందరి కథ (1967),

భామావిజయం (1967), పరమా నందయ్య శిష్యుల కథ (1966), లవకుశ (1963) కొంత భాగం తీసిన తరువాత పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. సుందర్ లాల్ నహతా, బి.ఎన్.రెడ్డిల  ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వ బాధ్యత చేపట్టి మిగిలిన భాగం పూర్తి చేశాడు..

దేవాంతకుడు (1960), పక్కింటి అమ్మాయి (1953), సంక్రాంతి (1952), అపూర్వ సహోదరులు (1950), వింధ్యరాణి (1948), గొల్లభామ (1947), నారద నారది (1946), బాల నాగమ్మ (1942), మాలతీ మాధవం (1940), వర విక్రయం (1939), మోహినీ భస్మా సుర (1938), సత్య నారాయణ వ్రతం (1938), చల్ మోహన రంగ (1937), దశావతారములు (1937), కాసుల పేరు (1937),

అనసూయ (1936), ధ్రువ (1936), కృష్ణ తులాభారం (1935), లవకుశ (1934 సినిమా) (1963), రామదాసు (1933),

సావిత్రి (1933) లాంటి సినిమాలలో తన ప్రతిభను ప్రదర్శించారు.1967, అక్టోబర్ 6 న పుల్లయ్య మద్రాసులో మరణించాడు.

  • రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ జర్నలిస్ట్, సెల్: 9440595494
C. Pullaiah considered cinema as his life/ zindhagi.com సినిమానే జీవితంగా భావించిన సి. పుల్లయ్య
Comments (0)
Add Comment