Bully story to laugh at
నవ్వు కోవడానికి బుల్లి కథ
ఆరోగ్యంపై వ్యంగ్య కథ
సైకిలు తొక్కడంతో దేశ ఆర్థిక వ్యవస్థ.. ఔను మీరు చదివింది నిజమే. సైకిలు తొక్కేవాడు దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. వాడు కారు కొనడు, కారు కోసం అప్పు తీసుకోడు, కారు ఇన్సూరెన్సు తీసుకోడు, పెట్రోలు కొనడు, కారును సర్వీసింగుకు మరమ్మత్తులకు పంపడు, పార్కింగ్ ఛార్జీలు చెల్లించడు.
పాపం డాక్టర్ లు గరీబులైతారెమో..
అన్నిటికంటే ముఖ్యం, వాడు లావు అవడు. ఆరోగ్యంగా ఉంటాడు.. ఇలాయితే పాపం డాక్టర్ ల భవిష్యత్ ఎలా..?
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యవంతులు అక్కర్లేదు. వాళ్ళు మందులు కొనరు. ఆసుపత్రుల చుట్టూ తిరగరు, డాక్టర్ల మొహం చూడరు. వాళ్ళ వల్ల దేశ స్థూల జాతీయ ఆదాయం ఒక్క పైసా కూడా పెరగదు.
మీరు సైకిలు తొక్కుతారా?
మెక్ డొనాల్డ్ కు వెడతారా?
ఆరోగ్యవంతుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే ఈ నష్టానికి విరుద్ధంగా మెక్ డొనాల్డ్ వల్ల ఎంత లాభమో చూడండి. ఒక్కొక్క మెక్ డొనాల్డ్ ఔట్ లెట్ కనీసం 30 మందికి – 10 మంది గుండె నిపుణులకు, 10 మంది దంత నిపుణులకు, బరువు ఎలా తగ్గాలి అని సలహాలిచ్చే మరో 10 మంది నిపుణులకు – ఉపాధి కల్పిస్తుంది. అదీకాక ఆ మెక్ డొనాల్డ్ లో పని చేసే వారుంటారు కదా.
మీరు సైకిలు తొక్కుతారా? మెక్ డొనాల్డ్ కు వెడతారా? దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని తెలివిగా నిర్ణయించుకోండి.
కొసమెరుపు: నడక మరీ ప్రమాదకరం. నడిచేవాళ్ళు కనీసం సైకిలు కూడా కొనరు కదా!
మూడేళ్ళ క్రితం విజయవాడ మకాం వచ్చేసాను.విజయవాడ వచ్చేక సైకిల్ మానేశాను.ఇప్పుడు నడక లేదా సిటీ బస్సు.
నాకు ఏ వాహనం లేదు.
ఓ పెద్దాయన ఫేస్ బుక్ నుంచి..