అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందడుగులు

త్వరలో బండి సంజయ్ మరో విడత పాదయాత్ర?

హైదరాబాద్ : బీఆర్ ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి మరో విడత పాదయాత్ర నిర్వహించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఇప్పటికే పాదయాత్ర నిర్వహిస్తూ పార్టీని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లిన బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని పటిష్టం చేయాలని పావులు కదుపుతుంది.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వర్గంతో టచ్ లో ఉంటున్నే ప్రజాక్షేత్రంలో ఉండటానికి బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

అందులో భాగంగాగానే విడతల వారిగా పాదయాత్ర నిర్వహిస్తూ జాతీయ నాయకులతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ నెల 18 లేదా 20వ తేదీ నుంచి పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టే అవకాశముంది.

BJP is moving forward with power as its goal
Comments (0)
Add Comment