Biographies of Kandukuri Veeresalingam
కందుకూరి వీరేశలింగం జీవిత విశేషాలు
*తెలుగు సాహిత్యంలో ‘తొలి’.. ” జంబలకిడి పంబ “
నవల రచన…!!
*1892లోనే ..” పత్నీ వ్రత ప్రబోధము” అనే అంశంతో అధిక్షేప రచన చేసిన ‘ కందుకూరి వీరేశలింగం పంతులు’ గారు!!
”తన దేహము తన గేహము
తన కాలము తన ధనమ్ము తన విద్య
జగజ్జనులకు వినియోగించిన ఘనుడీ
వీరేశలింగ కవి జనులార ” ! .. (చిలకమర్తి)
కందుకూరి వీరేశలింగం
కందుకూరి వీరేశలింగం 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రి
లో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు.
వీరేశలింగంగారు 130 కి పైగా గ్రంథాలు వ్రాసారు.ఇన్ని … గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో బహు అరుదు.ఇందు
లో రాజశేఖర చరిత్ర , సత్యరాజా పూర్వ దేశయాత్రలు వంటి అతి ప్రాముఖ్యత కలిగిన రచనలు న్నాయి.
సంస్కృత గ్రంథాలను తెలుగులోకి
పంతులుగారి ప్రతిభ సామాన్యమైనదికాదు. అనేకఇంగ్లీషు,
సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారుకూడా. బడి పిల్లల కొరకు ఎన్నో వాచకాలను అందించారు.స్వీయ చరిత్రను రాసుకున్నారు. ఆంధ్ర కవుల చరిత్రను రాసి,
ఎందరో కవులను వెలుగులోకి తెచ్చారు.ఆంధ్ర సమాజాన్ని
సంస్కరణల బాట పట్టించిన గొప్ప సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు.!
ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి అధిక్షేప రచన ….
“పత్నీ వ్రత ప్రబోధము” కందుకూరి వారి ఖాతాలో వుంది.
ఆధునిక సాహిత్యంలో చాలా ప్రక్రియలకు కందుకూరి వారే
ఆద్యులు.అలాగే ఈ అధిక్షేప రచనకు కూడా కందుకూరే
ఆద్యులు కావడం విశేషం.!!
1992 లో వీరేశలింగం పంతులు గారు “సత్యరాజాపూర్వ
దేశయాత్రలు”నవలను రెండు భాగాలుగా రచించారు.ఇది
పంతులు గారి స్వతంత్ర రచన కాదు. ఆంగ్లంలోని..”జొనా
జూన్ స్విఫ్ట్ గలివర్స్ ట్రావెల్స్ కు స్వేఛ్ఛానువాదం. ఇది
ఇంగ్లీషు, కన్నడ భాషల్లోకి కూడా అనువదింపబడింది
ఈ నవలను రెండు విభాగాలుగా రచించారు పంతులు గారు..ఈ నవల మొదటి భాగం ఆడు “మళయాళం”
ఇది అచ్చంగా స్త్రీలకు సంబంధించింది.,రెండోభాగం ‘లంకాద్వీపం ‘పురుషులకు సంబంధించినది.
*భారత దేశంలో స్త్రీలు పట్ల జరుగుతున్న అన్యాయాలు,
వారిపట్ల చూపుతున్న వివక్షను ప్రథమ భాగంలో ప్రస్తావిం
చారు.
*రెండో భాగం..సమాజంలో కేవలం ఆడువారి పట్లనే
కాదుపురుషుల పట్ల కూడా వివక్ష,అన్యాయాలు, జరు
గుతున్నట్లు రెండో విభాగంలో ఓ సరికొత్త కల్పన చేశారు.
ఆడవారి పట్ల జరుగుతున్న వివక్ష, అన్యాయాలకు…… ఇది రివర్స్ అన్నమాట.
సమాజంలో ఆడవాళ్ళకు పతిభక్తిని బోధించినట్లే, పురు
షులకు ” పత్నీ భక్తి’ ని బోధిస్తారు.సంస్కృతిలో ఆడపిల్ల
లకు…పసితనం నుంచీ పాతివ్రత్యం బోధిస్తున్నట్లే, మగ
వారికి పసితనం నుంచీ..మగపిల్లలకు” పత్నీవ్రతం”…..
బోధిస్తారు.
ఆడవాళ్ళు వితంతువులైనప్పడు కేశఖండనం పాటిస్తే…
విధురులందరికీ (భార్యను కోల్పోయిన వారికి) 👃ముక్కు
కోసేస్తారు.మొదటి భాగంలో భోగస్త్రీలున్నట్లే..రెండో భాగం
లో ‘ భోగ పురుషులుంటారు’.ఇక్కడ బాలికలు పాఠశాల
కు పోనట్లే ,అక్కడ మగ పిల్లలుబడికి పోరు.సమస్త నీతి శాస్త్రాలు ,కావ్యాలు ఆదేశంలో..పత్నీ వ్రతాన్నిబోధిస్తాయి.
అక్కడ ఆడు మలయాళంలో స్త్రీలు పాటించే ,ఆచరించే నోములు,వ్రతాలు గట్రా..ఎట్సెట్రా… ఇక్కడ పురుషులు ఆచరించడం విశేషం.అంటే…భారత స్త్రీకి అసలు ……
సిసలు నకిలీ బొమ్మగా పురుషుడు కనిపిస్తాడు.
అక్కడి పెద్దలు ,పురాణాలు బోధించేపత్నీ వ్రత బోధిని’
అనే శాస్త్ర సారాంశాన్ని వీరేశలింగం పంతులు గారు
ఇలా సత్యరాజా చార్యులు అనే పాత్ర…ద్వారా వెల్లడి
స్తారు.తెలుగు సాహిత్యానికి వెటకారానికి,వెక్కిరింతకు,
వేళాకోళానికి అధిక్షేప రచన ఇదే కావడం గమనార్హం.
“సత్యరాజా పూర్వాదేశయాత్రలు ” అనే గ్రంథం గురించి
పంతులుగారు తమ స్వీయ చరిత్రలో ఏం చెప్పారో…..
చూడండి..!
“స్త్రీల విషయమున మనవారు చేసిన యన్యాయము
లు తేటపడునట్లుగా వ్యాజ రీతిని సత్యరాజా పూర్వా
దేశ యాత్రల యొక్క ప్రథమ భాగమును రచించి ….
ప్రకటించి తిని ” !!
ఒక్క మాటలో చెప్పాలంటే…మన ఆధునిక తెలుగు
సాహిత్యంలో….తొలి జంబలకిడి పంబ ” రచన ఇదే..!!
Biographies of Kandukuri Veeresalingam