Batukamma in Dubai దుబాయ్ బూర్జ్ ఖలీఫాపై మన బతుకమ్మ

Batukamma in Dubai

దుబాయ్ బూర్జ్ ఖలీఫాపై మన బతుకమ్మ..

మన తెలంగాణ బతుకమ్మ ఇజ్జత్ మత్తు పెరిగి పోయింది. గింతకు ముందెప్పుడి కంటే ఎక్కువ గీసారి మొగులును అనుకునెంతా పైపైకి పోయింది. ఇగో.. గిన్ని రోజుల్లెంది గిప్పుడు ఇజ్జత్ ఎట్ల పెరిగిందనుకుంటుండ్రా..? మన బతుకమ్మకు పెటెంట్ ఎవ్వలో మీకు తెలుసు గదా..? అదే మన సీఎం కేసీఆర్ గారల కూతురు కవితమ్మ.. ఇగో శనివారం నిజామాబాద్- కామారెడ్డి రెండు జిల్లాల పొలిటికల్ లీడరులతోని దుబాయ్ పోయింది కవితమ్మ.

ఆమె ఉట్టిగానే పోయిందనుకుంటుండ్రా.. అదేమి కాదు. దుబాయ్ లో  ఎత్తైన బూర్జ్ ఖలీఫా నెత్తిన బంగారు ‘బతుకమ్మ’ చూసి ఇగో కవితమ్మతో పాటు పోయినోళ్లంతా మత్తు మురిసి పోయిండ్రు. గా బూర్జ్ ఖలీఫా బిల్డింగ్ మీద గిట్ల బతుకమ్మ బొమ్మ ఎగురేయాలంటే మత్తు పైసాల్ అవుతాయని మీరు అడుగద్దు.. నేను కూడా చెప్పననుకో.  బూర్జ్ ఖలీఫా బిల్డింగ్ మీద కలర్ కలర్ లో బతుకమ్మ రాంగానే కవితమ్మైతే మై మరిచి పోయిందానుకో. ఆ తల్లి మొఖం ఖుషితో వెలిగి పోయింది. ఎడారి దేశమైన దుబాయ్ లో విరబూసిన తంగేడు వనం అంటూ మత్తు ఖుషి అయ్యిండ్రనుకో.. Batukamma in Dubai

అగో.. గంత పెద్ద బిల్డింగ్ మీద బతుకమ్మను ఎట్లా ఆడిండ్రనుకుంటుండ్రా.. గాడ బతుకమ్మను ఎగురేయడంతో ఇజ్జత్ పైపైకి పోయిందంటుండ్రు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను చూపించి బతుకమ్మ గొప్పతనాన్ని దునియాకు చాటి చెప్పిండ్రు. ఇగో గిదంతా ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈయ్యళ్లా సాయంత్రం బతుకమ్మ వీడియోను బూర్జ్ ఖలీఫా తెరపై రెండు సార్లు చూపించిండ్రు. మూడేసి నిమిషాల ఆ  వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిండ్రు.  గంతేకాదు ముఖ్యమంత్రి ‌కేసీఆర్ గారి ఫోటోలను సైతం బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై చూపించిండ్రు. బతుకమ్మ, జై తెలంగాణ, తెలంగాణ జాగృతి అంటూ చూయించారు. యుఎఇ అధికారులు, బిజినెస్ మెన్ లు బతుకమ్మ ను చూసి ఖుషి అయ్యిండ్రట. తెలంగాణ రాష్ట్రం రాక ముందునుంచే కవితమ్మ గీ బతుకమ్మ పండుగను జరుపుతుంది. వేరే దేశాలలో కూడా తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటుండ్రు. మన దగ్గర నుంచి దుబాయ్ వెళ్లినోళ్లు లక్షా మంది వరకు ఈ వేడుకను చూసిండ్రని కవితమ్మ సంతోషం వ్యక్తం చేసింది. Batukamma in Dubai

ఈసారి  ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ పాటను తయారు చేసిండ్రు. తెలంగాణ యాస, బాషలో పాటలు రాసి ప్రజల మన్ననలు పొందుతున్న రచయిత మిట్టపల్లి సురేంధర్ రాసిన ఈ బతుకమ్మ పాట ప్రతి పల్లెకు వెళ్లింది.   ఇవ్వాల దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ద్వారా, తెలంగాణ పూల పండుగ మరోసారి మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గీ కవితమ్మ వెంట రాజ్యసభ సభ్యులు కె.ఆర్. సురేష్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జీవన్ రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్ సంజయ్,  బిగాల గణేష్ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, దాస్యం విజయ్ భాస్కర్, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు మత్తు మంది పాల్గొన్నారు.Batukamma in Dubai

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

సెల్ : 949 222 5111

Batukamma in Dubai / ZINDHAGI.COM/ YATAKARLA MALLESH/ KAVITHA BATHUKAMMA / TRS BATHUKAMMA
Comments (0)
Add Comment