Bathukamma is the creator of energy శక్తి స్వరూపిణి బతుకమ్మ
ప్రతి పండుగ పరంపరానుగతంగా ప్రత్యేక శైలిలో,
దేవిలను కొలుస్తూ, బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలను భక్తి శ్రద్ధలతో, పిల్లా పాపలతో కలిసి మహిళలు జంట పండు గలుగా పక్షం రోజుల తేడాతో నిర్వహించడం అనాదిగా ఆచరిస్తున్న సనాతన సాంప్రదాయం. బతుకునిచ్చే తల్లిని లక్ష్మీ గౌరి దేవిలను అభేదిస్తూ, శక్తి రూపంగా ఆటపాటల ద్వారా పూజిస్తూ, ఉన్నంతలో రకరకాల పదార్థాలను నివేదిస్తూ, కొత్త బట్టలు నగలు ధరిస్తూ, ఆడ బిడ్డలను ఆహ్వానిస్తూ, కలిసి జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మను పేర్చే విధానం, పూజించే తీరును బట్టి, తనను ఆరాధించడానికే శక్తిమాత ఆ రూపాన్ని కోరిందా అని అనిపిస్తుంది. శ్రీ చక్ర ఉపాసన సర్వోత్కృష్టమైన శక్తి ఆరాధన విధానాలలో ఒకటి. బతుకమ్మను పేర్చేటప్పుడు, కమలం షట్చక్షికం/ అష్టదళ పద్మాన్ని వేసి పేర్చడం ఆనవాయితీ. శ్రీచక్రం లోని మేరు ప్రస్తానం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటుంది.
Bathukamma is the creator of energy
శ్రీచక్రం లోని కుండలినీ యోగ విశేష శక్తిగా బతుకమ్మలో గౌరమ్మను నిలపడం చేస్తారు. ప్రధానంగా తెలంగాణ స్త్రీలు గౌరమ్మను,గౌరీ, లక్ష్మి సరస్వతులుగా త్రిగుణాత్మ స్వరూపిణిగా భావించి పూజిస్తారు. “శ్రీలక్ష్మి నీమహిమలూ గౌరమ్మ భారతి సతివయ్యి బ్రహ్మకిల్లాలిపై పార్వతి దేవివై పరమేశు రాణివై, భార్యవైతివి హరునకు గౌరమ్మా అంటూ పాడుకోడవడం విశేషం”. భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య లేక ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తూ, ఆనాటితో ప్రారంభించి మహర్నవమితో ముగించ బడే బతుకమ్మ పండుగ, ఆట పాటలతో నిర్వహించి, పిల్లా పాపలతో మహిళలు తన్మయత్వం పొందుతారు. ప్రతిరోజు వివిధ పిండి వంటలను ఆరగించడం చేత అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు అర్రెమి పేరుతో ఆరవరోజు సెలవు తీసుకుంటారు.
ఇళ్లలో ప్రతిరోజు ఒకరిని మించి మరొకరు పోటీలు పడుతూ గ్రామ పొలి మేరలో, పంట చేలలో, ఇళ్ళల్లో, పరిసర ప్రాంతాలలో లభ్యమయ్యే తంగేడు, గునుగు, బంతి, గన్నేరు, కట్ల, గోరింట, గుమ్మడి తదితర పూలతో పసుపు గౌరమ్మ దేవతా విగ్రహాన్ని పళ్ళెములో అందంగా, ఆకర్షణీయంగా పేర్చుతారు. నిత్య నూతన వస్త్ర దారులై, సాయంత్రం వేళ, బృందాలుగా పలు రకాల పిండి వంటలతో ఊరి బయటకు, జలాశయాల వద్దకు వెళతారు. మధ్యలో బతుకమ్మలను ఉంచి వృత్తాకారంలో ఆడుతూ, పాడుతూ లయ బద్దంగా అడుగులేస్తూ, పదానికి పదం కలుపుతూ, శాస్త్రీయంగా నృత్యం చేస్తారు. వెంట తెచ్చుకున్న తిను బండారాలను ముందుగా నైవేద్యం పెట్టి, Bathukamma is the creator of energy బతుకమ్మను నీటిలో నిమజ్జనం గావిస్తారు.
అనంతరం పిండి వంటలను తోటివారికి పంచుతూ, పిల్లలతో ఒకేస్థలంలో కూర్చుండి ముత్తయిదులు సామూహికంగా ఆరగిస్తారు. సాయంత్ర మంతా ఆహ్లాదకర వాతావరణంలో గడిపి, చీకటి పడ్డాక ఇళ్లకు చేరుకుంటారు. “చేమంతి వనములో భామలు చెలికుంటలో భామలు, ఓలలా డినారు” అంటూ గొల్ల భామలు – శ్రీకృష్ణుడు పాటలు; “రాత్రి వచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడే అమ్మ, “చిత్తూ చిత్తుల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మ ఈ వాడలోన” అంటూ శివ పార్వతుల గురించి; బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ
- ఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ
బతుకమ్మ గూర్చి; “జనకునింటి ఉయ్యాలో” అంటూ భూజాత యైన మహాసాద్ వి సీతాదేవి గురించే గాక “కలవారి కోడలు కలికి కామాక్షి”అంటూ సామాజిక అంశాల సమస్యలపై సైతం జాన పద బాణీలో బృందగానం చేసే సాంప్రదాయ గీతాలు మంత్ర ముగ్ధులను గావిస్తాయి. అన్ని వర్గాలు కలిసి ఆడడంలో మానవ సంబంధాలు, సమిష్టి భావనలు పెంపొందడంతో పాటు భారత దేశ ఔన్నత్యాన్ని తెలంగాణ ప్రాశస్త్యాన్ని తెలిపే సాంస్కృతిక వారసత్వం తరతరాలుగా కొన సాగుతున్నది. Bathukamma is the creator of energy కౌటుంబిక, చారిత్రక, పౌరాణిక, సంబంధ బాంధవ్యాల, సామాజిక అంశాలతో ఉన్న జానపద పాటల వల్ల అపురూప సాహిత్యాన్ని, వారసత్వాన్ని భావి తరాలకు అందించడం జరుగు తున్నది. కుల, మత, వర్గ, పేద, ధనిక భేదాలు లేకుండా, సమిష్టిగా, సామూహికంగా ప్రకృతి ఆరాధన భాగంగా జరుపుకునే బతుకమ్మ పండుగ చర్విత చర్వణంగా సాగుతున్న నిత్య లోకిక జీవనంలో ఒకింత మార్పు తెస్తూ, నూతనో త్సాహం, సోదర భావాన్ని అలౌకిక ఆనందాన్ని ఆన్నింటిని మించి సామూహిక భాగ స్వామ్యాన్ని పెంపొందించ గలదనే పరిపూర్ణ విశ్వాసంతో, బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందోత్సవాలతో ఏ యేటి కాయేడు పాల్గొంటున్నారు.
రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ జర్నలిస్ట్ సెల్: 9440595494