Bapu doll mahaprasthanam-5 బాపు బొమ్మల మహాప్రస్థానం-5

Bapu doll mahaprasthanam-5

బాపు బొమ్మల మహాప్రస్థానం-5

జయభేరి..!!

భావకవిత్వపు పద్ధతులూ, గ్రాంధిక భాషలో పద్యరచనను వదిలిపెట్టి వ్యావహారిక  భాషలో నవీన ధోరణిలో’ శ్రీశ్రీ ‘ రచించిన  మొదటి గేయం ఇది. శ్రీశ్రీ గారు ఈ కవిత రాసేనాటికే శ్లిష్టా  ఉమామహేశ్వరరావు ,’ నవీన‌‌ ‘  ధోరణిలో రచనలు చేస్తున్నాడు. అయితే శ్లిష్టా రచనలు తనకు ప్రేరణ కాలేదని శ్రీశ్రీ స్వయంగా చెప్పుకున్నాడు (అనంతం.పే125).  శ్లిష్టా ప్రభావంతో ముద్దుకృష్ణ రాస్తున్న వచన గీతాలను ఎప్పటికప్పుడు ముద్దుకృష్ణ ముఖతః నే శ్రీశ్రీ వినేవాడు. అలా వింటూ వచన గీతాన్ని కళారూపంగా తీర్చిదిద్దడానికి శ్రీశ్రీ కొంత పరిశోదన చేశాడు. హరీంద్రనాథ్ గీతాలూ,మరికొన్ని ఆంగ్ల గీతాలను తెనిగించడం ద్వారా ఈ పరిశోథనను మరింత ముందుకు తీసుకు వెళ్ళారు శ్రీశ్రీ.

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ..

“నేను సైతం ప్రపంచాగ్నికిసమిధ నొక్కటి ఆహుతిచ్చాను!

నేను సైతంవిశ్వ వృష్టికిఅశ్రువొక్కటి ధార పోశాను!

నేను సైతంభువనఘోషకువెర్రి గొంతుక విచ్చి మ్రోశాను!

ఎండ కాలం మండినప్పుడుగబ్బిలం వలెక్రాగి పోలేదా!

వాన కాలం ముసరి రాగానిలువు నిలువుననీరు కాలేదా?

శీత కాలం కోత పెట్టగ కొరడు కట్టీ,ఆకలేసీ కేక లేశానే!

నే నొకణ్ణేనిల్చిపోతే-చండ్రగాడ్పులు, వాన మబ్బులు,

మంచు సోనలుభూమి మీదాభుగ్న మౌతాయి!

నింగి నుండీ తొంగీ చూసేరంగు రంగుల చుక్కలన్నీరాలి,

నెత్తురు క్రక్కుకుంటూపేలిపోతాయి!

పగళ్ళన్నీ పగిలిపోయీ,నిశీథాలూ విశీర్ణిల్లీ, మహా ప్రళయం  జగం నిండాప్రగల్భిస్తుంది!

నే నొక్కణ్ణి ధాత్రినిండానిండి పోయీ, నా కుహూరత శీకరాలేలోకమంతా

జల్లులాడే ఆ ముహుర్తా లాగమిస్తాయి!

నేను సైతంప్రపంచాబ్జపుతెల్ల రేకై పల్లవిస్తాను!

నేను సైతంవిశ్వవీణకుతంత్రినై మూర్చనలు పోతాను!

నేను సైతంభువన భవనపుబావుటానై పైకిలేస్తాను”

శ్రీశ్రీ కూడా అంతే సంతృప్తిని పొందాడు

ముత్యాలసరం  ఛందస్సులోని ఒకటి రెండు పాదాలతోనే. ఎంత వైవిధ్యం  సాధించవచ్చో తెలుసుకున్నప్పుడు శ్రీశ్రీ గారికి ఆశ్చర్యం, ఆనందమూ  కలిగాయట. వైజ్ఞానికుడు ఓ కొత్త సత్యం  కనిపెట్టినపుడు ఎంత సంతృప్తి పొందుతాడో ‘ శ్రీశ్రీ కూడా అంతే సంతృప్తిని పొందాడు.

నేను సైతంప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!

మూడు పాదాలు ఈ చరణాన్ని, శ్రీశ్రీ ఇలా తిరగరాశాడు. యముని మహిషపు లోహ ఘంటలు మబ్బుచాటున ఖణేల్మన్నాయి.”. దీనికి సంబంధించి జనార్దనరావు (శ్రీశ్రీ మిత్రుడు) పత్రిక ఉదయినిలో ..” ముత్యాలసరం..ఒక కృషి ” శీర్షికనశ్రీశ్రీ ఏకంగా ఓ వ్యాసమే రాశాడు. ప్రభావం…!! గిబ్సన్ రాసిన..”. I even I “అనే గీతం శ్రీశ్రీ ‘జయభేరి’కి స్ఫూర్తి నిచ్చింది.’ఆ గేయం నేను చదివి వుండక పోతే ఈ గేయం నేను రాసివుండకపోను.’అని శ్రీశ్రీ చెప్పుకున్నాడు. ఈ గేయం  ఉదయిని పత్రికలో అచ్చేసి మిత్రధర్మం పాటించాడు కొంపెల్ల జనార్దనరావు.

బాపు బొమ్మలు బ్నిం వివరణ

ఆరంభంలో తొమ్మిది పంక్తులు, అంతంలో మార్చి రాశారు. శ్రీశ్రీ మొదటి పంక్తులలో తాను చేసిన పనుల్ని చెప్పుకొచ్చాడు. భువనఘోషకువెర్రి గొంతుకలిచ్చి మోసిన తాను నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తానన్నాడు. ఇది అభ్యుదయానికి సూచన. బాపు బొమ్మలు బ్నిం వివరణ..!!”ఈ గేయానికి యధాలాపంగానే బాపు హోమ్ వర్క్ చేశారు. ఈ గేయానికి రెండు బొమ్మలు వేశారు. ఒకటి భేరి. మధ్యలో భూమండలం. అంటే, భూమండలమంతా శబ్దించే ఢంకా. రెండు ప్రపంచాబ్దం. అందులో ఒక తెల్ల రేకులా  ప్రబోధించడమే కాదు. ప్రజ్వలిస్తున్నట్లు వేశారు బాపు. ఈ బొమ్మ కూడా వాష్ కలర్స్ పెయింటింగ్”..!! (బ్నిం)

ఎ.రజాహుస్సేన్

రచయిత హైదరాబాద్

Bapu doll mahaprasthanam-5/zindhagi.com/ yatakarla mallesh / abdul rajahussen
Comments (0)
Add Comment