బాబు మోహన్ బూతు పురాణం

బాబు మోహన్ బూతు పురాణం

సంగారెడ్డి : బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బూతు పురాణం అడియో వైరల్ అయింది. ఫోన్ చేసిన ఆందోల్ నియోజకవర్గ బిజెపి కార్యకర్త వెంకట రమణని బాబు మోహన్ బండ బూతులు తిట్టారు. మీతో కలిసి పార్టీలో పని చేస్తానని కార్యకర్త చెప్పాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆందోల్ ని అభివృద్ధి చేశానని చెప్పారు. నువ్వెంత నీ బతుకెంత అంటూ కార్యకర్తను తిట్టారు. నేను రెండు రాష్ట్రాల్లో పని చేయాలని అమిత్ షా నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారన్న బాబుమోహన్, నేను ప్రపంచ స్థాయి నాయకుడిని అంటూ కార్యకర్తపై తిట్ల పురాణం అందుకున్నారు. బండి సంజయ్ ఎవడ్రా..వాడు నా తమ్ముడు అన్నారు. ఇంకో సారి నాకు ఫోన్ చేస్తే, చెప్పు తీసుకుని కొడుతా అంటూ కార్యకర్తకు బెదిరించారు. సదరు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Babu Mohan Boothu Puranam
Comments (0)
Add Comment