ఒకసారి చదవండి
మనం అద్భుతాలతో పయనిస్తూ, ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం. మన చుట్టూ ఏడు అద్భుతాలు ఉన్నాయి. ఒకసారి చదవండి..
1 . తల్లి
మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి. మనకు జననం ఇవ్వడానికి, మరణం దాకా వెళ్లి వచ్చిన తల్లే ప్రపంచంలో మొట్టమొదటి అద్భుతం.
2 . తండ్రి
మన కళ్లల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు. మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు. దుఃఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రే రెండో అద్భుతం.
3.తోడబుట్టిన వాళ్లు
మన తప్పులను వెనుకెసుకు రావాడానికి, మనతో పోట్లాడడానికి, మనకు నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్లు. తోడ బుట్టిన వాళ్లే మూడో అద్భుతం.
4 . స్నేహితులు
మన భావాలను పంచుకోడానికి, మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి, ఏది ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులే నాలుగో అద్భుతం.
5 భార్య / భర్త
ఈ ఒక్క బంధం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ ఉన్న అన్ని బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది. ఈ బంధాన్ని అర్థం చేసుకునే వారు దొరికితే ఇదే ఐదో మహా అద్భుతం.
6 . పిల్లలు
మనలో స్వార్థం మొదలవుతుంది. మన పిల్లలు బాగుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది. వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. వారి కోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లిదండ్రులు అసలు ఉండరు. అందుకే, పిల్లలే ఆరో అద్భుతం. ఇంకా 7 అద్భుతం ఏమిటంటే….
7 . మనవళ్ళు మనవరాళ్లు
వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలనే ఆశపుడుతుంది. వీరితో ఆడు తుంటే వయసునే మరిపించే బంధమే ఏడో అద్భుతం. ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటే అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం…
కాసింత ప్రేమ చాలు… ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి. చిన్న పలకరింపు చాలు.. అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం .. ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్ల వారే సరికి ఉంటాడో లేదో తెలియదు. అందుకే ఉన్న దానిలో సర్దుకు పోయి హాయిగా జీవించడంలోనే ఉంది అసలైన ఆనందమైన అద్భుతం..