ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరోనా పై అవగాహనా ర్యాలీ.

ఏపీ 39 టీవీ,
మే 28
రాయదుర్గం:-అనంతపురం జిల్లా, రాయదుర్గం పట్టణంలో ఆర్. అండ్.బి అతిథి గృహం నుండి వినాయక సర్కిల్ వరకు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సతీమణి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్పర్సన్ కాపు భారతి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పోరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ రాయదుర్గం పట్టణ ప్రజలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్ పర్సన్ కాపు భారతి మాట్లాడుతూ.. ప్రజలందరూ స్వీయా నిర్బంధంలో ఉండి ప్రజల అమూల్యమైన ప్రాణాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి కాపాడుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే ప్రజలు బయటకు రావాలని, బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆమె ప్రజలకు సూచించారు. వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు పరితపిస్తున్నారు అని ఆమె ఆ శాఖలో సిబ్బందిని కొనియాడారు. అనంతరం పోలీస్ సిబ్బందికి, వైద్య శాఖ సిబ్బందికి మెడికల్ కిట్లను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆమె పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పోరాళ్ల శివ, రెడ్ క్రాస్ మెంబర్లు, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, Dr. మంజు వాణి, SI రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

R.ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం చార్జి.

Comments (0)
Add Comment