Autobiography of Real Hero Rajanna-01
రియల్ హీరో రాజన్న ఆత్మకథ
ఉరి శిక్ష నుంచి జర్నలిస్టుగా జర్నీ …
ధారావాహిక -01
————————————-
ఉదయించిన సూరీడు ఆకాశంలో పరుగులు పెడుతూ వస్తున్నాడు. మేఘాల మధ్య నుంచి సూర్య కిరణాలు నేలపై పడి వేడి అవుతుంది.
పోలీస్ వ్యాన్ వేగంగా వచ్చి ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణ లో ఆగింది.
అప్పుడు సమయం ఉదయం 10 గంటలు.
పోలీసులు తూపాకులు పట్టుకుని వ్యాన్ దిగి నిలబడి వ్యాన్ లోనికి చూస్తున్నారు.
చేతులకు బేడీలు వేసి ఉన్న ఓ యువకుడు ఆ వ్యాన్ లోంచి నిర్లక్ష్యంగా దిగుతున్నాడు. అతని వయసు ఇరవై ఏళ్ళు ఉంటాయి.
“రాజన్న… కోర్టు టైం అవుతుంది. బంట్రోతు పిలిసినప్పుడు లేకుంటే జడ్జీ మందలిస్తాడు. లోనికి వెల్లుదాం పదా… ” అన్నాడు రిజర్వ్ ఎస్సై భీమన్న.
“కోర్టులోకి వెళ్ళకుండా ఇడా పండుకున్నామా సార్..” హేళనగా సమాధానం ఇచ్చాడు రాజన్న.
వారం రోజులుగా కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు వింటూ కోర్టు పై కోపంతో ఊగి పోతున్నాడు రాజన్న.
న్యాయాన్ని రక్షించే పోలీసులు తప్పుడు సాక్షాలు చూపిస్తుంటే జడ్జీ మౌణంగా ఉంటున్నాడని అతను మనసులో రగిలి పోతున్నాడు.
“రాజన్న… నిన్న జడ్జీ పై కోర్టులో చెప్పు విసరడంతో అతను అవమానంగా ఫీల్ అయ్యాడు. నీ మీద కోపంతో ఉన్నాడట. ” అన్నాడు ఎస్సై భీమన్న.
“మా ఊరి దొర ఆరాచాకాలు చూసి నేను ఎదిరించాను. వాడు నాపై కక్ష పెంచుకుని దాడి చేస్తే ఆత్మ రక్షణ కోసం హత్య చేశాను మొర్రో… అంటూ స్వయంగా కోర్టులో చెప్పినా వినిపించుకునే టోడు లేడాయే..” బాధను వ్యక్తం చేశాడు రాజన్న.
“అయినా… జడ్జ్ సాక్షాలు చూసి తీర్పు చెపుతాడు.. నీవేమో కోపంతో జడ్జీ పై చెప్పు విసరడం సరియైన నిర్ణయం కాదు” అన్నాడు ఎస్సై.
“నేను మా ఊళ్ళో ఓ దుర్మార్గుడుని హత్య చేసిన సంతోషం ఉంది. అయినా.. దొరకు అనుకూలంగా పోలీసులు దొంగ సాక్షాలు చూపించడం నాకు నచ్చలేదు. అందుకే న్యాయం జరుగని ఈ కోర్టును బహిష్కరిస్తున్నట్లు జడ్జీ కీ చెప్పాను.” అన్నాడు రాజన్న.
“ఈరోజు నీపైన ఉన్న హత్య నేరంలో జడ్జీ గారు తీర్పు చెబుతారు. నిన్న నీవు చెప్పును జడ్జీ పై విసిరినందుకు నీ చేతులు వెనక్కి పెట్టీ బేడీలు వేసుకుని కోర్టులోకి తీసుకు రమ్మని జడ్జ్ గారు ఆదేశం.” వివరించాడు ఎస్సై భీమన్న.
ఆ సమయంలోనే…
“రాజన్న హాజిరాయే…” కోర్టు బంట్రోతు మూడు సార్లు పిలిసాడు.
పోలీసులు రాజన్నను కోర్టు బోనులో నిల బెట్టారు.
(రెండవ ఎపిషోడ్ లో కలుద్దాం)
యాటకర్ల మల్లేష్. జర్నలిస్ట్
9492225111