రాప్తాడు 44వ జాతీయ రహదారి సంపూర్ణ బంద్

AP 39TV 26మార్చ్ 2021:

రాప్తాడు మండల కేంద్రంలో 44 జాతీయ రహదారి మీద సిపిఎం,సిపిఐ, సి ఐ టి యు, టిడిపి ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ నిర్వహించారు వామపక్షాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పోతలయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా నిరుద్యోగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైల్వే, బిఎస్ఎన్ఎల్, తపాలా,ఎల్ఐసి,ఎయిర్ పోర్ట్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలన్నారు.బిజెపి ప్రభుత్వ విధానాలు నిరుద్యోగులకు,ప్రజలకు శాపంగా మారినాయన్నారు. అలాగే వ్యవసాయ చట్టాల బిల్లులు కూడా రద్దు చేయాలని,విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకూడదని, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించి విభజన హామీలు నెరవేర్చాలని తెలియజేశారు లేనిపక్షంలో విద్యార్థి ప్రజాగ్రహానికి గురికాక తప్పదని బిజెపి ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోతలయ్య బండి శ్రీరాములు, సత్తి, చిన్న ముత్యాలమ్మ, మేరమ్మ, లక్ష్మీదేవి, ఓబులమ్మ, పొన్నూరు స్వామి, బాలకృష్ణ, సుబ్బారావు, సిపిఐ రామకృష్ణ, నాగరాజు, రవి, చలపతి, రమేష్, టిడిపి పంపు ఇంద్ర శేఖర్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Comments (0)
Add Comment