Anand bonded with that dog ఆ డాగ్ తో ఆనంద్ బందం

Anand bonded with that dog
ఆ డాగ్ తో ఆనంద్ బందం

Happy Dogs Kennel Boarding and Training Hostel. ఇది రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం ఖానపూర్ లో ఉంది. ఆ కెన్నెల్ డాగ్స్ తో నాకు ఐదేళ్ల అనుబందం ఉంది. వీ6 న్యూస్ ఛానల్ లో సీనియర్ జర్నలిస్ట్ గా పని చేసిన సందర్భంలో ఈ హెప్పి కెన్నెల్ డాగ్స్ బోర్డిండ్ అండ్ ట్రైనింగ్ హాస్టల్ పై స్టోరీ చేశాను. Anand bonded with that dog

బ్యాంక్ జాబ్ కు భై చెప్పి ఆనంద్ డాగ్స్ హాస్టల్ పెట్టుకున్నాడంటే స్టోరీ చేయాలనిపించి వెళ్లాను. ఆ తరువాత ఫ్యామిలీతో వెళ్లాను. ఆ డాగ్స్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కు ఇష్టమే. ఆ డాగ్స్ తో ఆడుకున్నాం. ఆ డాగ్స్ కూడా ఇంటి మనుషుల్లాగే ఫ్రెండ్లిగా మూవ్ అయ్యాయి.

ఈ ఉపొద్ఘతం ఎందుకు చెబుతున్నానంటే..?

ఆనంద్ జీవితాన్ని మార్చేసిన డాగ్ సిల్లు మరణించింది. పదేళ్లుగా ఆనంద్ తో మమెకమైన ఆ డాగ్ మరణించడంతో బాధతో ఉన్నాడు ఆనంద్. అతనికి ఆ సిల్లు అంటే ప్రాణం. ఆ డాగ్ హాస్టల్ పెట్టక ముందే చిన్న ‘‘డాగ్ పప్పి’’ ని ఇంటికి తీసుక వచ్చాడు ఆనంద్. దాని పేరు ముద్దుగా సిల్లు అని పేరు పెట్టుకున్నాడు. బ్యాంక్ జాబ్ చేస్తునే ఇంటికి వచ్చి ఆ సిల్లుతోనే కాలక్షేపం చేసేవాడు. ఆనంద్ కు ఎన్ని బాధలున్నా.. ఆ డాగ్ సిల్లు దగ్గరకు వస్తే అన్ని మరిచి పోయేవాడు. ఓ రోజు ఆనంద్ కు జీవితంపై విరక్తి పెరిగింది.

ఆత్మహత్య చేసుకోవాలని..

ఆనంద్ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఆ సమయంలోనే ఆ డాగ్ సిల్లు అతని దగ్గరకు వచ్చి అల్లారి చేసింది. అంతే.. ఆ ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నాడు. ఆ తరువాతనే బ్యాంక్ జాబ్ కు బై చెప్ పదేళ్ల క్రితం ‘‘Happy Dogs Kennel Boarding and Training Hostel హెప్పి కెన్నెల్ డాగ్స్ బొర్డిండ్ అండ్ ట్రైనింగ్ హాస్టల్ ’’ పెట్టుకున్నాడు. ఇప్పుడు వందకు పైగానే డాగ్స్ ను ఆ హాస్టల్ లో సాధుతున్నాడు.

మూడు నెలలుగా..

ఆనారోగ్యంతో బాధ పడుతున్న డాగ్ సిల్లుకు వైద్యం చేయించారు. పరీక్షలు చేసిన వెటర్నరీ డాక్టర్ డాగ్ రెండు కిడ్నీలు ఫెయిలైనవి అని చెప్పాడు. ఆ క్షణం నుంచి ఆ డాగ్ కు గ్లూకోజ్ లు పెట్టి బతికిస్తూ వచ్చాడు ఆనంద్. డాగ్ బతుకదని తెలియగానే యూత్ నైర్ ఇంజక్షన్ ఇస్తారు. ఆ తరువాత ఫెయిన్ తెలియకుండా డాగ్ నిద్రలోనే మరణిస్తాది. కానీ అల్లారు ముద్దుగా తన చేతుల మీదుగా పెరిగిన ఆ డాగ్ సిల్లుకు ఇంజక్షన్ ఇప్పియ్యడానికి ఆనంద్ కు మనసు రాలేదు. నవంబర్ 7, 2021 నాడు డాగ్ సిల్లు మరణించింది. Anand bonded with that dog

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Anand bonded with that dog / Happy kinnera dogs boarding and training hostel / yatakarla mallesh
Comments (0)
Add Comment