Amma self-esteem
అమ్మ ఆత్మగౌరవం
ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేని
అవ్వ..పూలు అమ్ముకుంటూ…
తనువు వశివాడినా బ్రతుకు
ఆరాటంతో పోరాడుతోంది..
ఆత్మస్తైర్యాన్ని ఆయుధంగా
కష్టాన్ని నమ్ముకుని….
దొక్కాడినన్ని రోజులు రెక్కాడాలి
అనే నానుడిని నిజం చేస్తూ…
ఈ వయసులో కూడా తన్ను
తాను పోషించుకుంటుంది..
ఈ అవ్వ ఉద్యోగాలే కావాలి
అని ఊరికే తిరిగే యువతకి
కూడా స్ఫూర్తి దాయకం…
బాధ్యతల బరిలో గెలిచి
పుడమి దరి చేరిందాక కష్టపడే
తత్వానికి…
అవ్వా..
నీ ఓర్పు,నేర్పు,సహనం
పట్టుదలకి నీ వయసుకి
అన్నింటి కి వందనాలు
అవ్వా…