అభివృద్ధి పనులు వేగవంతం చేయండి – ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

AP 39TV 30 ఏప్రిల్ 2021:

అనంతపురం :నియోజకవర్గ పరిధిలోని రుద్రంపేట,నారాయణపురం, రాజీవ్ కాలనీ,రూరల్ పంచాయతీలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ భాస్కర్ రెడ్డి,ఎమ్మార్వో లక్ష్మీనారాయణ రెడ్డి లతో కలిసి సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పంచాయితీలలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.సచివాలయాలు,విలేజ్ క్లినిక్,ఆర్బికే ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.సిసి రోడ్లు, డ్రైనేజీ లేని కాలనీలు గుర్తించి వాటి నిర్మాణం పనులకు ప్రణాళికలను ఏర్పాటు చేయాలని సూచించారు.రాజీవ్ కాలనీ బ్రిడ్జ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు త్వరగా ఏర్పాటు చేసి బ్రిడ్జ్ నిర్మాణం పనులను ప్రారంభించాలని ఆదేశించారు.నాణ్యత లో ఎక్కడా రాజీపడకుండా నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించడమేకాకుండా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఈ లు భాస్కర్ రెడ్డి,శ్రీనివాస్,సెక్రటరీలు నరసింహారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,అశోక్,సంబంధించిన సచివాలయ అధికారులు పాల్గొన్నారు.

 

 

Comments (0)
Add Comment