About hill farm cinema
కొండ పొలం సినీమా ముచ్చట
అవార్డు విన్నింగ్ కి ఒక రైటింగ్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాకు లోబడిఎంతోకొంత ప్రజోపయోగమ్ సాధించే ప్రక్రియ
ఏదైనా ప్రశంసనీయమైనదే. ఒకటి రెండు జిల్లాల ఆధిపత్య కులాల భాష, సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు మొత్తం ప్రజలవిగా రుద్ధ పడినప్పుడు పడిన దశాబ్దాల యాతన నుంచి రాష్ట్రం విడిపోయి వీటన్నింటికీ ఎంతో మేలు చేసింది.
అనేక ప్రాంతాల మాండలికాల సౌందర్యం తెలుగు సినిమాని కొత్త కొత్తగా ముస్తాబు చేస్తున్నది. మట్టి మనుషుల వెట్టి కథలను యవనిక మీదకి మోసుకొస్తుంది. సినీ నటులు కష్టపడి పలికినప్పటికీ ఈ మాండలికం ఎంత బాగుంది? నీళ్ల కోసం
కన్నీటి చెలమ లైన జనం గోస స్క్రీన్ నిండా ఎంత హృద్యంగా జాలువారింది?
అడవి మీద ప్రేమ ఎంత గొప్పగా ఉంది? ప్రేమను పెనేసుకుని ఆకలిని జయించే మనుషుల మధ్య ఉండే అపురూపమైన మట్టి బంధం ఎంత అద్భుతంగా ఉంది? కొండపొలం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం.
కానీ ‘ఉప్పెన’ని ప్రేమించినంత హుషారుగా కొండ పొలంలో వైష్ణవ్’ ని ప్రేమించని తరమ్ మార్పుని కోరుకునే వాళ్లకి
ఒక సవాల్ విసురుతోంది. మనకి నచ్చింది ఏదో యువతకి నచ్చడం లేదు. ఈ గ్యాప్ పూడనంత కాలం కొండపొలాల్లో పచ్చగడ్డి మొలవదు.
అడవి పచ్చదనాన్ని కళ్ళ రెటీనా మీద కళ్ళాపి చల్లుకోడానికి,మట్టి మనుషుల గట్టి ప్రేమని హృదయంలో మొలకెత్తిన్చడానికి, మాండలికపు సొబగుతోమాతృభాషకు పులకలు తెప్పించడానికి ఓసారి ‘కొండపొలం’ చూసేయండి.