నారాయణఖేడ్: రైతు మెడలో ఉరితాడు లాంటి మూడు వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఢిల్లీ లో ఎముకలు కొరికే చలిలో ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతుగా డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్ కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం( కేవిపిఎస్)సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది కెవిపియస్ జిల్లా కమిటీ సభ్యులు యస్, గణపతి, లక్మణ్, ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన లో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు మంద బలం ఉందని తమ ఇష్టానుసారం కార్పిరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించడం రైతాంగాన్ని వ్యవసాయం నుండి దూరం చెయ్యడం కోసం దొంగచాటుగా పార్లమెంట్లో 3 వ్యవసాయ ఆర్డినెన్స్ లను ఆమోదించుకుందన్నారు .తక్షణమే ఆ మూడు చట్టాలను రద్దు చేయాలన్నారు.విద్యుత్ సవరణ బిల్ తీసుకొచ్చి రాష్ట్రాల హక్కులు కాలరాస్తుందన్నారు.సామాజిక శక్తులు సంఘాలు ఈ బంద్ లో పాల్గొని జయప్రదం చేయాలని కేవిపిఎస్ కార్యకర్తలు జెండాలు పాటుకోని పాల్గొనాలని కేవిపిఎస్ నాయకులు పిలుపునిచ్చారు.