50 years of literary journey 50 యేళ్ళ సాహితీ ప్రయాణం

50 years of literary journeyఅబ్దుల్ రజాహుస్సేన్
50 యేళ్ళ సాహితీ ప్రయాణం..

66వ బడిలో తొలి అడుగు….!!

నేనో…
తెల్ల కాగితం..
లాంటోణ్ణి

నా గురించి
మీరేమైనా
రాసుకోవచ్చు

కాకుంటే…
నాదో షరతు..

కాగితం
నల్లబడకూడదు
నలిగిపోకూడదు.!!

*ఎ.రజాహుస్సేన్!!

50యేళ్ళ రచనా జీవితం.ప్రచురించిన పుస్తకాలు
(15 ) తక్కువే. ఓ 100 పుస్తకాలకు సరిపడా రచనలు.
ప్రస్తుతం ఫేస్బుక్ వేదికగా సాహిత్య వ్యాసంగం….!!

ఇంతకు మించి నా గురించి నేను చెప్పుకునేదేముంది?
యాభై యేళ్ళ పాటు నా కలం అవిశ్రాంతంగా రాస్తూనే
వుంది.అంటే నా రచనా వ్యాసంగానికి స్వర్ణోత్సవం..
ఓ రచయితకు ఇంతకంటే కావలసిందేముంటుంది.?
అయితే ఈ యాభై యేళ్ళలో గత ఆరేళ్ళు‌(రిటైర్మెంట్
తర్వాత) రచనలకు ఫుల్ టైమ్ కేటాయించడం వల్ల
చాలానే రాశాననిపిస్తోంది.ముఖ్యంగా ఫేస్బుక్లో కొత్త
తరంతో నా ప్రయాణం మంచి కిక్ ఇచ్చింది.వయసులో
నాబిడ్డలకంటే చాలా చిన్నవాళ్ళు కవిత్వం దగ్గర్నుంచి
నా కంటే పెద్దవాళ్ళ కవిత్వం వరకు నా సాహితీ ప్రస్థానం
కొనసాగుతోంది.పాత కొత్తల మేలు కలయికతో నా
కాలం కొత్త సొగసులు పోతోంది.

నిజానికి అరవై దాటి అయిదేళ్ళు కావస్తున్నా ..నా కలం
మాత్రం ఇంకా ఇరవైకి చేరువకాలేదనిపిస్తోంది.దేహానికి
వయసుకానీ.‌‌అక్షరానికి వయసే ముంటుంది.అదెప్పుడూ
‘నవజవ్వనే’.(*Ever Green).

ఫేస్బుక్లో నా ఆర్టికల్స్ వేల సంఖ్యదాటి చాలా రోజులైంది.
మొనాటనీకి దూరంగా వుండాలని వివిధ శీర్షికలు ప్రారం
భించాను.. రొటీన్ గా రాసే ఆర్టికల్స్ పక్కన బెడితే..
వివిధ శీర్షికల ద్వారా రాసిన ఆర్టికల్స్ కూడా చాలానే …
వున్నాయి. ఇన్ని అని చెప్పడం కోసమని కాదుకానీ…
శీర్షికల ధారావాహికకు నెంబరింగ్ ఇస్తున్నాను.ఇది కేవ
లంనా సౌలభ్యం కోసమే..కరోనా మొదలయ్యాక “కరోనా
కాలమ్ ” పేరుతో 205 మంది గురించి,సంక్షిప్తంగా వారి
వారి ప్రొఫైల్ తో పాటు ,సాహిత్యం,కరోనా కాలమ్ లో
వాళ్ళే చేస్తున్నదీ ఇందులో ప్రస్తావించాను.మంచి స్పంద
నే వచ్చింది.కరోనా సెకెండ్ స్టేజ్ ప్రారంభంలో..” చిత్రకళ”
శీర్షికను ప్రారంభించాను.స్థానిక చిత్రకారులనుంచి ప్రపం
చంలోని వివిధ చిత్రకారుల పరిచయంతో పాటు,వారి చిత్రాలు,అవసరమైన చోట చిత్రకళా రీతులను ఇందులో పేర్కొంటూ ఆర్టికల్స్ రాస్తున్నాను.ఇప్పటివరకు 212 ఆర్టికల్స్ రాశాను.ఇంకా రాస్తాను.ఔ శీర్షిక వల్ల ప్రపంచం లోని పలు దేశాల్లోని చిత్రకారులు నాకు మిత్రులుగా దొరికారు.ఇక తెలుగు రాష్ట్రాల్లోని చిత్రకారులైతే‌ ఆత్మీయులయ్యారు.

ప్రపంచంలోని చిత్రకారులు గురించి ఇంత విస్తృతంగా ,ఈ విధంగా రాసిన వారు అరుదుగా నే వుండొచ్చు..అయితే వారిలో నేను ఖచ్చితంగావుంటాననే అనుకుంటున్నాను.ఇక ” కాఫీ విత్ …పొయెట్రీ “
పేరునరాస్తున్న కాలమ్ ఈనెలాఖరు కల్లా 200 ఎపిసోడ్ లుపూర్తవుతాయి.ఇక ” పరిచయం

” పేరుతో రాస్తున్న
శీర్షిక…137 కు చేరుకుంది. ” ….కవిత్వంతో నా ప్రయా
ణం” శీర్షిక 20 కు చేరువైంది..ఇటీవలనే ప్రారంభించిన
“సత్సంగమ్” శీర్షిక 14 కుచేరింది.ఇక పుస్తకం సమీక్షల
కు నెంబరింగ్ లేదు.” కొత్త పుస్తకం” పేర ఇప్పటివరకు
57 పూర్తయ్యాయి.ఇవి కాకుండా కవిత్వం సరేసరి…
“పచ్చి జ్ఞాపకం ” శీర్షికను 100 (లఘు‌) కవితలు పూర్త
య్యాయి.పుస్తకంగా తేవాలి.జనరల్ గా రాసినవి లెక్కలేదు..వీటన్నిటిని పుస్తకంగా తెచ్చేందుకు డిటిపి
కూడా చేయించాను.కానీ ప్రచురణకు అడుగులు ముందు
కు పడటంలేదు..దుర్గానంద్ రచన..’శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ”

.. తెలుగు అనువాదం,తో పాటు ఆయనే
రాసిన..’శ్రీ వేంకటేశ్వరుని పై కొన్ని తీయటి పద్యాలు
కలిపి పుస్తకంగా తెస్తున్నాను.ప్రస్తుతం ఈ పుస్తకం
ప్రెస్ లో వుంది.నా మనవడు చెప్పిన కథ..”ఓ తోడేలు
సాహస గాధ’ ఇప్పటికే పుస్తకంగా వచ్చింది‌. ఇప్పుడు
అదే కథకు ఆంగ్లానువాద పుస్తకం ప్రస్తుతం ప్రెస్ లో
వుంది..ఈనెలలో ఒక సీనియర్ కవి,విమర్శకుడి సాహి
తీ ప్రస్థానంతో పాటు, ఓ కవయిత్రి సమగ్ర సాహితీ విమ
ర్శపుస్తక రచన ప్రారంభించ బోతున్నాను.ఇంతకు మించి
పెద్దగా ప్రణాళికలంటూ ఏమీలేవు.కాలం కలిసొస్తే….నా
అముద్రిత పుస్తకాల దుమ్ముదులపాలి.

*ఎ.రజాహుస్సేన్ అను నేను..!!

అబ్దుల్ రజాహుస్సేన్ …పుట్టింది,పెరిగింది సొంతూరు
మంగళగిరిలో. అక్కడే..సి.కె హైస్కూల్.సికె జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువు పూర్తయింది.
గుంటూరు హిందూ కళాశాలలో… బిఎ.డిగ్రీ. నాగార్జున యూనివర్సిటీలో ఎమ్ ఎ,అక్కడే కొంత కాలం ఎమ్ ఫిల్ (పరిశోథన…)

1981విటిజెఎమ్ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా ఓ
ఏడాది ఉద్యోగం..ఈనాడులో జర్నలిస్టు గా ఎనిమిదేళ్ళ అనుభవం. 1988 లో కర్షక పరిషత్ లో పిఆర్వోగా చేరిక
ఆతర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖలో అసిస్టెంట్ డైరె
క్టర్ గా ప్రభుత్వ సర్వీసు ప్రారంభం. జాయింట్ డైరెక్టర్ గా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో 2015 లో సర్వీస్ నుంచి రిటైర్ మెంట్ . ప్రస్తుతం విశ్రాంత జీవితంలో అవిశ్రాంత
సాహితీ సేవ.

రాష్ట్ర కర్షకపరిషత్ ఛైర్మన్ గా వున్నప్పుడు చంద్రబాబు
గారికి,పీఆర్వోగా..నేదురు మల్లి జనార్దన రెడ్డి గారు
సిఎం గావున్నప్పుడు ఆయన పి ఆర్వోగా నేదురుమల్లి రాజ్యలక్ష్మిగారు విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వున్నప్పుడు ఓ .ఎస్. డి గా…పనిచేశాను.అలా రాజకీయా
లో కూడా బాదరాయణ సంబంధం వుంది.గత 37 ఏళ్లుగా హైదరాబాద్ లో నివాసం.ఈ మధ్యనే తెనాలి
దగ్గరలోని నంది వెలుగు గ్రామానికి నివాసం మారింది.

*సాహిత్యం..రచనలు..!!

1972నుండి సాహిత్య రచనలు చేస్తున్నారు.వచ్చే ఏడా
దికి సాహితీ జీవితం 50 యేళ్ళకుచేరుకుంటుంది.ప్రస్తుతం ఫేస్బుక్ మాధ్యమంగా సాహితీ సేద్యం కొనసాగుతోంది.. ఫేస్బుక్లో వివిధ శీర్షికలతో ప్రతీ యేటా వందలకొద్దీ వ్యాసా
లు,ఆర్టికల్స్ ,కవితలు రాస్తున్నారు.

*ముద్రిత రచనలు..!!

1.పింగళి వెంకయ్య జీవిత చరిత్ర..1988
తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రచురణ

2.ఆనవాలు…సాహిత్య వ్యాసాల సంకలనం 1988

3.చదువుల సారం….విద్యా వ్యాసాల సంకలనం .
2005

4.చదువుల తాత.. చుక్కా రామయ్య గారి జీవిత
కథనం..2006 తెలుగు, ( హిందీ, ఇంగ్లీషు భాషల్లో
అను వాదమైంది.)

5.బాలల కలామ్ 2006.

6.తిరంగా మసల్మాన్ ..కవితా సంకలనం 2006

7.చేవ్రాలు…సాహిత్య వ్యాసాల సంకలనం..2006

8.హజ్ యాత్ర ..మార్గదర్శకాలు.(2007)

9.నేనెరిగిన నేదురుమల్లి…ఎన్ జనార్దన రెడ్డి గారి
జీవిత కథనం (2007)

10.అపరాజిత…ఎయిడ్స్ బాధిత మహిళల
యదార్థ గాధలు (2007)

11.ఎగరేసిన ఎర్రజెండా..భీమిరెడ్డి నరసింహారెడ్డి
జీవిత కథనం.(2008)

12.నెల్లూరు బ్రౌన్ బంగోరె…బండి గోపాలరెడ్డి జీవిత
కథనం.(2009)

13.అక్షర నివేదన…సాహిత్య వ్యాసాల
సంకలనం.(2010)

14.చలమిజమ్..! చలం సాహిత్య సమీక్ష (2011)

15.మరో మైదానం…చలంగారి మైదానం
నవలకు సీక్వెల్ …(2011) నవల

*ఇవి కాకుండా…అముద్రిత పుస్తకాలు…

*వాల్మీకి రాయని రామాయణం
*పఠాభి ఫిడేలు రాగాల డజన్
*పైగంబర కవిత్వం.. ఓ సమీక్ష
*లఘురూప కవితా ప్రక్రియ ఓ పరిశీలన.
*కథా సంకలనం
“నేటి స్త్రీ వాద సాహిత్యం
*శ్రీశ్రీ గురజాడ
*సిరిసిరి మువ్వ..చెకుముకి రవ్వ.
శ్రీశ్రీ వ్యాసాల సంకలనం
*గాంధీజీ ప్రాణాలు కాపాడిన.” బతఖ్ మియా
అన్సారి “ నవల
*చరితార్థుడు”…సయ్యద్ నశీర్ అహమ్మద్
జీవితం.. పరిశోథన.రచనలు.!!
*నేటి బిసి కవిత్వం…పరామర్శ..
*సాహిత్య సమీక్షలు
*ప్రముఖుల పరిచయాలు.
*పచ్చి జ్ఞాపకం….కవిత్వం
*కొంచెం ప్రేమిద్దాం”(కవిత్వం)
*సత్సంగమ్…!!
*చలం..ఓ అనుభవం.!!

ఇంకా..ఎన్నో పుస్తకాలు ప్రచురణ కావాల్సి వుంది.

*తేజ వారి పత్రికలో *మహతి శీర్షికతో 5సంవత్సరాలు
సాహిత్య కాలమ్ నిర్వహణ. గత 6సం.లుగా..ఫేస్బుక్
లో 4000 కు పైగా సాహిత్య వ్యాసాల రచన.

*రాజకీయ, సాంస్కృతిక,సామాజిక అథ్యయనంతో
పాటు, జర్నలిజం…సాహిత్యం..సినిమాలు, ఇష్టం.
అన్నింటికంటే సాహితీ వేత్తలను కలిసి మాట్లాడటం,
అభిప్రాయాలను పంచుకోవడమంటే చాలా ఇష్టం.
నా సాహితీ జీవితంలో 50 యేళ్ళ ప్రస్థాన మిది.
స్వర్ణోత్సవ సంరంభంమిది..

66వ బడిలో అడుగుపెడుతున్న ఈ వేళ నిజంగా
ప్రత్యేకమైంది…మీ ఆశీస్సులు కోరుతూ…

✏️.ఎ.రజాహుస్సేన్
నంది వెలుగు..!!

50 years of literary journey / abdul rajahussen / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment