విదేశాల నుంచి భారత్ వచ్చిన 39మందికి కరోనా పాజిటివ్

వివిధ దేశాల్లో కరోనా తీవ్ర రూపు దాల్చుతున్న నేపథ్యంలో భారత్ లోనూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రెండ్రోజుల వ్యవధిలో విదేశాల నుంచి భారత్ వచ్చిన 6 వేల మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 39 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యంలో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి వచ్చేవారిని ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉంటేనే భారత్ లోకి అనుమతించాలని అధికారులను ఆదేశించింది. కాగా, ప్రస్తుత పరిస్థితిని కేంద్రం అంచనా వేస్తోంది. వచ్చే 40 రోజులు కీలకమని, జనవరి రెండో వారానికి భారత్ లో కరోనా కేసులు వెల్లువెత్తే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

39 people who came from abroad are corona positive / thewidenews.com /yatakarla mallesh
Comments (0)
Add Comment