20 21.సంవత్సరపు ఆల్ పెన్షనర్స్ డైరీ మరియు కాలమానినిఆవిష్కరణ

తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 20 21 సంవత్సర పు డైరీ మరియు కాలమానిని భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారి శ్రీమతి తెల్లం సుభద్ర ఈరోజు సబ్ ట్రెజరీ కార్యాలయ ఆవరణంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డైరీ ని క్యాలెండర్ ను నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉన్నదని పెన్షనర్లు వారియొక్క జిఓ లతో కూడినఈ డైరీ పెన్షనర్లకు కు ఎంతో ఉపయోగం అన్నారు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వర రావుమాట్లాడు తూ పెన్షన్ దారులకు ఈ డైరీ కరదీపిక ని తెలంగాణ స్టేట్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఈ పి ఎస్ 19 95 పెన్షన్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్షన్ రూల్స్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (యన్ పి ఎస్)వైద్య ఖర్చులు ప్రభుత్వ ఆర్థిక సహాయం ఆదాయపన్ను ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు వివిధ ఆస్పత్రులలో ఈ హెచ్ ఎస్ పథకం కింద మరియు మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ కింద చేయు చికిత్సలు వివరాలు పెన్షన్ రికార్డులు తదితర అనేక అంశాలు పొందుపరిచారన్నారు ఇది ప్రతి ఒక్క పెన్షనర్ దగ్గర ఉండతగినదన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్,ఎస్ టి వో సుభద్ర, కార్యాలయ సిబ్బంది క్రాంతికుమార్, గౌరీ, సుబ్బయ్య, రామ్మోహన్ రావు, ఆదర్శ కుమార్,హరినాద్‌ పర్చూరి నాగేశ్వరరావు శివ ప్రసాదు మురళి కృష్ణ దాసు కిషన్ రావు తదితరులు పాల్గొన్నారుఈ డైరీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి కావలసినవారు పాత ఎల్ఐసి ఆఫీసు ముందు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసులోసంప్రదించగలరు..

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment