శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం ; సియం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తాధాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గొర్లె కిరణ్..ఈ నెల 21వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఈ రోజు ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాలుగు మండలాల కన్వీనర్లుతో నిర్వహించిన సమావేశంలో అన్నారు.ఎచ్చెర్లనియోజకవర్గంలోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండల కన్వీనర్లు పైడి శ్రీనువాసరావు,దన్నాన రాజినాయుడు,సనపల నారాయణరావు,మీసాల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.